కేంద్ర పన్నుల్లో మే నెలకు సంబంధించి రాష్ట్రాల వాటాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038.70 కోట్లు విడుదల చేయగా అందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ వాటాగా రూ. 982 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ.1,892.64 కోట్లు మంజూరు చేసింది. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల మేరకే ఈ కేటాయింపులు జరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ కేటాయింపుల్లో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌కి రూ.8,255.19 కోట్లు, బీహార్‌కి రూ.4,631.96 కోట్లు, వెస్ట్ బెంగాల్‌కి రూ.3,461.65 కోట్లు, గుజరాత్‌కి రూ.1,564.4 కోట్లు, అస్సాం రాష్ట్రానికి రూ.1,441.48 కోట్లు విడుదల అయ్యాయి.