లాక్ డౌన్ కారణంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల తేదీలు వాయిదా పడ్డాయి. ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం లేదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు మే 4న యూపీఎస్సీ ప్రకటించింది. తాజాగా యూపీఎస్సీ పరీక్షల తేదీలపై ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలకు సంబంధించి వివరాలు వచ్చే నెల 5న ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సమాచారమిచ్చింది.