ఎండ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, చాలా మంది కాస్తా ఎండ తగలగానే అమ్మో అని భయపడి పోతుంటారు. ఎండలో ఉండడం ప్రతి మానవునికి చాలా అవసరం. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. మానవుల్లో ఎముకల బలానికి డి విటమిన్ చాలా అవసరం. దీని వల్ల కండరాల కూడా బలంగా మారతాయి. డి విటమిన్ లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కచ్చితంగా అందరూ కాసేపైనా ఎండని ఆస్వాదించాల్సిందే. అలా కాకుండా చాలా మంది ఈ సమస్య పరిష్కారానికి మందులపై ఆధారపడుతుంటారు. అలాంటి వారంతా ప్రకృతి నుంచి ఫ్రీగా లభించే ఎండలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది ఎండ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అంతేనా, మానసికంగా కాస్తా ఒత్తిడిగా ఫీల్ అవుతుంటారు. అలాంటివారు ఎండలో కూర్చోవడం వల్ల చాలా వరకూ మానసిక ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడికి చాలా లక్షణాలు ఉన్నాయి. వీటి వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే, ఒత్తిడిలో ఉన్నాం అని మనకి చాలా సార్లు తెలియకపోవచ్చు. అయితే కొన్ని లక్షణాల ద్వారా ఒత్తిడి సమస్యతో పోరాడుతున్నామని తెలుసుకోవచ్చు. అందులో ముఖ్యంగా నలుగురిలో కలవలేకపోవడం, అతిగా తినేయడం, అలసట, నిద్రలేమి, అతి నిద్ర ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఒత్తిడి గురించే తెలిపే లక్షణాలు అని చెప్పొచ్చు. ఇటువంటి ఒత్తిడితో బాధపడేవారందరికీ ఎండ అనేది చాలా ముఖ్యం. అయితే, ఏ ఎండలో బడితే ఆ ఎండలో కూడా ఉండకూడదు. ఉదయాన్నే ఉండే ఎండ చాలా మంచిది. దీని వల్ల శరీరానికి డి విటమిన్ అందుతుంది. అలా కాకుండా మధ్యాహ్నం ఎండ శరీరానికి అంత మంచిది కాదు. ఉదయపు ఎండ మంచిది కాబట్టే అప్పుడే పుట్టిన పిల్లలకి ఉదయాన్నే ఎండను చూపించాలని నిపుణులు చెబుతుంటారు.
ఎండలో ఎంత సమయం ఉండాలి అనే దానిపై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఎక్కవ సమయం ఉండాలా తక్కువ సమయం ఉండాలా? నిపుణులు ఎంత సమయం సూచించారు అనేది తెలుసుకోవాలి. సాధారణంగా ఉదయాన్నే సూర్యరశ్మికి 15 నిమిషాలు ఉంటే చాలు ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల చాలా వరకూ డి విటమిన్ అందుతుంది. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఒత్తిడి కూడా దూరం అవుతుంది. మానసిక, ఆరోగ్య సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి. శరీరంలోని ఎముకలకే కాకుండా, శరీర రోగ నిరోధక వ్యవస్థకు కూడా సూర్మరశ్మి చాలా అవసరం. ఉత్తర భారతదేశానికి చెందిన 69 శాతం మంది మహిళల్లో విటమిన్-డి లోపం ఉంది. వారి శరీరానికి సూర్యరశ్మి సరైన మోతాదులో అందకపోవడం కూడా అందుకు ఒక కారణం.
చర్మం పలుచగా ఉంటే, వేసవి కాలంలో రోజూ ఓ 20 నిమిషాలు ఎండలో ఉంటే సరిపోతుందని కొందరు వైద్యులు చెబుతున్నారు.నల్లగా ఉన్నవారికి అందుకు 6 రెట్లు ఎక్కువ సమయం అవసరమవుతుందని అంచనా వేశారు. అయితే, నల్లని చర్మానికి ఎండను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. వారు ఎండలో ఎక్కువ సేపు ఉండగలరు. త్వరగా అలసిపోవడం, కీళ్ల నొప్పులు, పాదాలు వాయడం, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం, కండరాల బలహీనత విటమిన్-డి లోపానికి సూచనలు. అయితే, వీటిని చాలా మంది పట్టించుకోరు. విటమిన్-డి లోపం క్రమక్రమంగా శరీర భాగాలన్నటినీ బలహీనపరుస్తుంది. దీంతో వృద్ధాప్యంలో ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పులు మరింత ఎక్కువవుతాయి. కాబట్టి రోజూ ఉదయం, సాయంత్రం పూట ఎండలో కొద్దిసేపైనా ఉండటానికి ప్రయత్నం చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa