పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ స్టే విధించింది. పర్యావరణ ప్రభావంపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఏపీ సర్కార్ ను ఆదేశించింది. కమిటీ నివేదిక వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఎన్జీటీ సూచించింది. ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన జీవోను ఏపీ సర్కార్ ఇటీవలె జారీ చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి సాధ్యమైనంత తొందరగా పనులు మొదలుపెట్టాలని భావిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్)లో చుక్కెదురైంది. నారాయణపేటకు చెందిన శ్రీనివాస్ పోతిరెడ్డిపాడుపై ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దీంతో జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ ఎన్జీటీలో విచారణ చేపట్టంది. పర్యావరణ ప్రభావంపై నాలుగు శాఖల సభ్యులతో కేంద్ర కమిటీ వేసింది. కేఆర్‌ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్‌కు చెందినవారికి కమిటీలో సభ్యత్వం కల్పించినట్లు ఎన్జీటీ తెలిపింది. తమ నుంచి ఆదేశాలు అందే వరకూ ఎటువంటి పనులు కూడా చేయకూడదని కమిటీ ఏపీ సర్కార్ కు హెచ్చరికలు జారీ చేసింది.