హైబీపీ ఉందని కూడా చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, ఎలాంటి లక్షణాలు బయటికి కనపడకపోయినా కూడా హైబీపీ మెదడుకీ, గుండెకీ, కళ్ళకీ, కిడ్నీలకీ హాని చేస్తుంది. తలనొప్పి, ఆయాసం, నోస్ బ్లీడ్, కళ్ళు తిరగడం, చాతీలో నొప్పి, కళ్ళు మసక బారడం, యూరిన్ లో బ్లడ్ వంటి లక్షణాలు హైబీపీ ఉన్నప్పుడు చూడొచ్చు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. రెగ్యులర్ గా బీపీ చెక్ చేయించుకోవడం మంచిది. మీ కుటుంబంలో ఎవరికైనా హైబీపీ, గుండె జబ్బులు వంటివి ఉంటే తప్పనిసరిగా బీపీ రెగ్యులర్ గా చెక్ చేయించుకుంటూ ఉండటం మంచిది. హైపర్టెన్షన్ రెండు రకాలుగా వస్తుంది. రెండింటికీ వేర్వేరు కారణాలున్నాయి.
ప్రైమరీ హైపర్ టెన్షన్ అనేది వారసత్వంగా వస్తుంది. అనారోగ్యకరమైన జీవనశైలి వలన ఇది వస్తుంది. సెకండరీ హైపర్ టెన్షన్ అనేది కిడ్నీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వాడుతున్న మందుల సైడ్ ఎఫెక్ట్స్, మద్యం సేవించటం వంటి అనేక కారణాల వల్ల సెకండరీ హైపర్ టెన్షన్ వస్తుంది. ప్రైమరీ హైపర్ టెన్షన్ జీవనశైలిలో మార్పుల ద్వారా కంట్రోల్లో ఉంటుంది. సెకండరీ హైపర్ టెన్షన్ కారణాలని బట్టి మెడికేషన్ ఉంటుంది. సెకండరీ హైపర్ టెన్షన్ ట్రీట్‌మెంట్ లో కూడా జీవనశైలి మార్పులు తప్పనిసరిగా ఉండాలి.
హైబీపీ తొందరగా బయటపడదు కాబట్టి, దాని వల్ల జరిగే హాని ముందుగా తెలియదు. హెల్దీ ఆర్టరీస్ ఫ్లెక్సిబులగా బలంగా ఉంటాయి. అందులోంచి రక్తప్రసరణ సులభంగా జరిగిపోతుంది. హైబీపీ వల్ల ఈ ఆర్టరీస్ ఫ్లెక్సిబిలిటీ ని కోల్పోతాయి. దీనివల్ల ఆహారంలోని కొవ్వు పదార్ధాలు అక్కడ ఉండిపోయి రక్తప్రసరణను అడ్డుకుంటాయి. దీని వల్ల రక్తనాళాలు పూడుకుపోడం, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
హైపర్ టెన్షన్ వల్ల గుండెకి పని పెరిగిపోతుంది. రక్తనాళాల్లో పెరిగిన ప్రెజర్ వల్ల గుండె ఎక్కువ రక్తాన్ని ఎక్కువ ఫోర్స్ తో పంప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల హార్ట్ ఎన్లార్జ్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. ఎన్లార్జ్డ్ హార్ట్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్, కార్డియాక్ డెత్ వంటివి సంభవిస్తాయి. మనిషి మెదడు హెల్దీ బ్లడ్ యొక్క రెగ్యులర్ సప్లై మీద ఆధారపడుతుంది. హైబీపీ వల్ల మెదడుకి అందే బ్లడ్ సప్లై తగ్గుతుంది. దాని వల్ల జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తి, మాట్లాడడం, లాజికల్ గా ఉండడం వంటివి తగ్గుతాయి. హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చలేం. కేవలం ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకుండా చేయగలమంతే.
కొన్ని లైఫ్ స్టైల్ ఛేంజెస్ ద్వారా అసలు హైబీపీ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఉంటే తగ్గించుకోవచ్చు. ఆహారంలో పళ్ళు, కూరలు, లీన్ ప్రొటీన్స్, హోల్ గ్రైన్స్ వంటి తీసుకుంటూ ఉండాలి. వారంలో కనీసం ఐదురోజులు అరగంట పాటూ వ్యాయమం చెయ్యడం తప్పనిసరి. మెడిటేషన్, యోగా వంటి వాటి ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ సేవించడం వంటివి తగ్గించుకోవడం ఉత్తమం. హైపర్ టెన్షన్ ని కంట్రోల్ లో పెట్టుకుని కాంప్లికేషన్స్ మారకుండా చూసుకోవడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాలూ, పాల పదార్ధాలు, మాంసాహారం తగ్గించి శాకాహారం తీసుకోవడం వల్ల ట్రాన్స్ ఫాట్స్ బదులు పీచుపదార్ధం ఎక్కువ వెళ్తుంది. పళ్ళూ, కూరగాయలూ, ఆకుకూరలూ ఎక్కువ తీసుకోడం మంచిది. రెడ్ మీట్ బదులు చికెన్, ఫిష్ లాంటి లీన్ ప్రొటీన్స్ తీసుకుంటే బాగుంటుంది.
హైబీపీ ఉండి గుండెజబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్నవారు ఉప్పు బాగా తగ్గించాలి. రోజుకి 1500 - 2300 మిల్లీగ్రాముల మధ్యలోనే ఉప్పు తీసుకోవాలి. దీనికి చక్కటి సూత్రం పాకేజ్డ్ ఫుడ్స్, రెస్టారెంట్ ఫుడ్స్ తగ్గించి ఇంట్లోనే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వండుకోవడం. స్వీట్స్, బెవెరేజస్ లో పోషకాలేమీ ఉండవు. మీకు స్వీట్స్ తినాలనిపిస్తే తాజా పళ్ళు గానీ, డార్క్ చాక్లేట్ గానీ తినండి. డార్క్ చాక్లేట్ తింటే బ్లెడ్ ప్రెజర్ ని తగ్గిస్తుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు.
