ఇంటర్నెట్‌డెస్క్: కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుట్టాడన్నట్టు మొన్నటికి మొన్న ఓ శిశువు పుట్టీపుట్టగానే నడుస్తూ ట్రెండింగ్ అయ్యాడు. తాజాగా మరో శిశువు పుట్టగానే తల కింద రెండు చేతులు పెట్టుకుని పోజు కొడుతున్న ఫొటో ఒకటి వైరల్‌గా మారింది.
ఈ శిశువు ఎక్కడ జన్మించాడో తెలీదు కానీ.. ఈ చిట్టితండ్రి స్టైల్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అది చిన్నప్పటి రజనీకాంత్ ఫొటో అని కొందరు అంటుంటే, వీడి పుట్టుకలోనే స్టైల్ ఉందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.