లాక్ డౌన్ వల్ల ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారు. వారి కుటుంబాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. అయితే వారి కోసం ఏపీ సర్కార్ కొన్ని చర్యలను తీసుకుంది. ఆటో డ్రైవర్లకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. ‘వాహన మిత్ర’కింద డ్రైవర్లు అందరికీ రెండో విడత ఆర్థిక సాయం అందజేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఓనర్ కమ్ డ్రైవర్లు, ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ వృత్తిగా జీవిస్తున్నవారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. జూన్ 4న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకానికి సంబంధించి లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియ మే 26 లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేయనున్నారు. గతేడాది లబ్దిపొందిన వారు మళ్లీ దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు.