ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, విజయవాడ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్న కోవిడ్ 19 ఆస్పత్రుల్లో మొత్తం 550 పోస్టులు భర్తీ చేస్తోంది. ఈ పోస్టులన్నీ విజయవాడలోనే ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 550 ఉన్నాయి. మెడికల్ ఫీల్డ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వేతనం రూ.53,945 ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు
dme.ap.nic.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు చేయడానికి 2020 మే 18 చివరి తేదీ.