ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోధి ధర్మ మరణం.. ఇప్పటికీ ఓ అంతుచిక్కని మిస్టరీ!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 16, 2020, 03:41 PM

ఇండియాలో పుట్టి చైనా ప్రజల ఇష్ట దైవంగా మారిన బోధి ధర్మ బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించారు. బోధి ధర్మ అసలు పేరు ధర్మ వర్మ. ఆయన ఐదో శతాబ్దంలో తమిళనాడులోని కంచిపురం పాలిస్తున్న రాజు స్కందవర్మ మూడో కుమారుడు సంతానం. నాటి పల్లవ సామ్రాజ్యానికి మూడో తెలుగు చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. బోదిధర్మను ఆరాదించేవాళ్లు కూడా తమిళనాడులోనే ఎక్కువ. బోదిధర్మ ఇండియాలోనే జన్మించినా గురువు ఆజ్ఞలను పాటించి చైనాకు వెళ్లాల్సి వచ్చింది. బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞతార వద్ద శిష్యరికానికి చేరాడు. ఆయన గురువు ధర్మ వర్మ పేరును బోధి ధర్మగా మార్చారు.
బొదిధర్మలో మానసిక స్థైర్యం ఉన్నా శారీరక శక్తి చాలా తక్కువగా ఉందని గురువు గమనించారు. ఈ సందర్భంగా కొన్నాళ్లు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని సూచించారు. దీంతో బోదిధర్మ దేశమంతా తిరిగి యోగాతోపాటు పలు మర్మవిద్యలు నేర్చుకున్నారు. నాలుగేళ్ల తర్వాత శారీరక, మానసిక దృఢత్వంతో తిరిగి ఆశ్రమానికి చేరిన బోదిధర్మకు గురువు అసలు రహస్యాన్ని తెలిపారు. గురువు ఆదేశాల మేరకు బోదిధర్మ తనకు 40 ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి బౌద్ధ గ్రంథాలపై పట్టు సాధించారు. 67 ఏళ్ల వయస్సులో సముద్ర మార్గంలో చైనాకు బయల్దేరారు. లియాంగ్ అనే రాజ్యానికి చేరుకున్న బోదిధర్మకు అక్కడి రాజు ‘వు’ ఆహ్వానం పలికారు. అయితే బోదిధర్మను అక్కడి ప్రజలు బౌద్ధ గురువుగా కాకుండా భారతీయుడిగానే చూసేవారు. భారతీయులు ఆహారాన్ని చాప్ స్టిక్స్‌తో కాకుండా చేతులతో తింటారని, మలాన్ని కూడా చేతులతోనే శుభ్రం చేసుకుంటారని, పరిశుభ్రంగా ఉండరంటూ ఎవరూ బోదిధర్మకు ఆశ్రయం కల్పించేవారు కాదు. దీంతో ఆయన షావోలిన్ అనే ప్రాంతంలోని ఓ గుహలో ధ్యానం చేయడం మొదలు పెట్టారు. తొమ్మిదేళ్లు ధ్యానంలోనే ఉన్న బోదిధర్మను ప్రజలు బుద్ధుడి మరో అవతారంగా భావిస్తారు. ఈ విషయం చైనా మొత్తం పాకుతుంది. అక్కడి నుంచి జపాన్, కోరియా తదితర దేశాలకు కూడా బోదిధర్మ బోధనలు విస్తరించాయి. దీంతో ఆయనకు ఆసియాలోని ఇండియా మినహా అన్ని దేశాల నుంచి శిష్యరికానికి చేరారు. వీరికి బోధి ధర్మ తాను భారత దేశంలో నేర్చుకున్న యోగా తదితర మర్మ కళలను మేళవించి కుంగ్‌ఫూను నేర్పించారు. బోదిధర్మ తర్వాత ఆయన శిష్యుడు షేన్ గ్యాంగ్ 29వ బౌద్ధ ఆచార్యుడిగా బాధ్యతలు స్వీకరించారు.
గురువుకు ఇచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తిచేసిన బోదిధర్మ ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తన శిష్యులకు తెలిపి.. షేన్ గ్యాంగ్‌ను ఇక గురువుగా స్వీకరించాలని ఆదేశించారు. అయితే, బోదిధర్మ తమని విడిచి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఓ శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోదిధర్మను చంపేశాడని, బోదిధర్మ బౌతిక కాయాన్ని ఓ పర్వతం ప్రాంతంలో సమాధి చేశారని చెబుతారు. అయితే, అది అసత్యమని బోదిధర్మ 170 ఏళ్ల వయస్సులో 536లో చనిపోయారనే వాదన ఉంది. ఈ విషయం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa