ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీలో మూడవ దశ పోలింగ్‌ ప్రశాంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 01:25 AM

 -మూడో విడతలో 61.16 శాతం ఓటింగ్‌


 -అనుమానం వద్దు అఖిలేశే సీఎం


 -ములాయం స్పష్టీకరణ


 -శివపాల్‌ యాదవ్‌ కారుపై రాళ్ల దాడి  


 -లక్నోలో ఓటు హక్కును వినియోగించుకున్న హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌


 -యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, మాజీ సీఎం మాయావతి కూడా 


 -ఇక నాలుగో విడతకు రంగం సిద్ధం


 -సోనియా ఇలాకా రాయ్‌బరేలీలో తదుపరి పోలింగ్‌


లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 69 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 61.16శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో 826 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో విడత పోలింగ్‌లో పలువురు ప్రము ఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. లక్నోలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, కేంద్ర మంత్రులు ఉమాభారతి, కల్‌రాజ్‌ మిశ్రా, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్‌ జైశ్వాల్‌, బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్‌ తదితరులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు మళ్లీ అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి అవుతారని, ఇం దులో ఎవరికీ ఎలాంటి అనుమానమూ అవసరం లేదని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌ మూడో దశ ఎన్నికల సందర్భంగా సైఫై నియోజకవర్గంలో తన కోడలు అపర్ణా యాదవ్‌తో కలసి వోటు హక్కును విని యోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మళ్లీ అఖిలేశ్‌ సీఎం అని చెప్పారు. తన సోదరుడు శివపాల్‌ యాదవ్‌ కూడా భారీ మెజారిటీతో గెలుస్తాడంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. మరో పక్క అఖిలేశ్‌ కూడా తాజా ఎన్నికలపై స్పందిస్తూ ఈసారి కూడా విజయం తమకే వస్తుందని చెప్పారు. ఎస్పీ- కాంగ్రెస్‌ కూటమి భారీ విజయం సాధించ …నుందని అన్నారు. బీజేపీ దెబ్బ తినడం ఖాయమని తెలిపారు. తన తండ్రి ములాయం ఆశీస్సులు తనకు నిండుగా ఉన్నాయని, మళ్లీ అధికారం చేపడతా మని ధీమా వ్యక్తం చేశారు.


యూపీలో వోటు వేసిన ప్రముఖులు


 ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. 69 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 826 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2.41 కోట్ల మంది వోటర్లు ఉన్నారు. 61.16 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు తెలియజేశారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు తమ వోటు హక్కు వినియోగిం చుకున్నారు. లక్నోలో కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి వోటు హక్కును వినియోగిం చుకున్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, కేంద్ర మంత్రులు ఉమాభారతి, కల్‌రాజ్‌ మిశ్రా, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్‌ జైశ్వాల్‌, బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్‌ తదితరులు సైతం తమ వోటు హక్కును వినియోగించుకున్నారు.


`అఖిలేష్‌, ప్రతీక్‌.. నాకు రెండు కళ్లు'


ఉత్తర ప్రదేశ్‌ మూడో దశ ఎన్నికల్లో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులు వోటు హక్కును వినియోగించుకున్నారు. ములాయం, ఆయన భార్య సాధన గుప్తా, కుమారులు అఖిలేష్‌ యాదవ్‌, ప్రతీక్‌ యాదవ్‌, కోడళ్లు డింపుల్‌ యాదవ్‌, అపర్ణా యాదవ్‌ వోటు వేశారు. సాధార ణంగా మీడియాకు దూరంగా ఉండే సాధనా గుప్తా వోటు వేసిన అనంతరం కాసేపు విలేకరులతో మాట్లాడారు. అఖిలేష్‌, ప్రతీక్‌ ఇద్దరూ తనకు రెండు కళ్లు వంటివారని అన్నారు. తమ కుటుంబమంతా ఒక్కటేనని చెప్పారు. అఖిలేష్‌.. ములాయం మొదటి భార్య కొడుకు కాగా, ప్రతీక్‌.. ములాయం రెండో భార్య సాధన కొడుకు. అఖిలేష్‌ భార్య డింపుల్‌ కనౌజ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ప్రతీక్‌ భార్య అపర్ణ లక్నో కంటోన్నెంట్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆ మధ్య ములాయం ఇంట్లో, ఎస్పీలో ఆధిపత్య పోరు సాగినపుడు ఆయన కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. సాధన, అపర్ణ, ములాయం సోదరుడు శివపాల్‌ ఒక వైపు, అఖిలేష్‌, ములాయం మరో సోదరుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌ మరో వైపు ఉన్నట్టు కథనాలు వినిపిం చాయి. విభేదాలను పక్కన పెట్టి ఏక తాటిపైకి వచ్చిన ములాయం కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో తామంతా ఒక్కటేనని చెబుతున్నారు.


ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్‌పై రాళ్ల దాడి


లక్నో : సమాజ్‌వాదీ పార్టీ నేత, ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు శివపాల్‌ యాదవ్‌పై ఆదివారం ఉదయం రాళ్ల దాడి జరిగింది. ఆయన తన కారులో ఎన్ని కలు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ ఘటన యాదవులు అత్యధికంగా ఉండే ఎత్వా జిల్లా జస్వంత్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలో జరిగింది. ఈ దాడిలో శివపాల్‌కు ఏవైనా గాయాలు అయ్యాయా అన్నది తెలియరాలేదు. అక్కడికి సమీపంలోనే ఉన్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి, ఆయన కారును పంపించారు. కాగా, ఆది వారం యూపీలోని 12 జిల్లాల్లో పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగినట్టు వార్తలు వస్తున్నాయి. శివపాల్‌పై దాడి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


300 సీట్లలో గెలవబోతున్నాం : మాయావతి


 యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 300 సీట్లలో తమ పార్టీ విజయం సాధించబోతున్నదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం లక్నోలోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 251కి వచ్చి తన వోటు హక్కును వినియోగించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. పూర్తి మెజారిటీ తమకు రానుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం మూడో దశ పోలింగ్‌ ప్రశాంతంగా సాగి ంది. మొత్తం 69 స్థానాలకు వోటింగ్‌ జరిగింది. కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సొంత నియోజకవర్గమైన లక్నో, సమాజ్‌వాదీకి గట్టి పట్టు, యాద వులు అధికంగా ఉన్న కన్నౌజ్‌, మైన్‌పురి, ములాయం సొంత జిల్లా ఇటావా తదితర ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.


నాలుగో దశలో సోనియా ఇలాకాలో పోలింగ్‌


186 మంది కోటీశ్వరుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు


ఉత్తర ప్రదేశ్‌లో నాలుగో దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ దఫా సోనియా సొంత నియోజకవర్గమైన రాయ్‌ బరేలీ సహా 12 జిల్లాల్లో ఈ నెల 23న పోలింగ్‌ జరగనుండగా, మొత్తం 680 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 189 మంది కోటీశ్వరులు ఉన్నారని ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. బిఎస్‌పి నుంచి 45 మంది, బిజెపి నుంచి 36 మంది, సమాజ్‌వాదీ నుంచి 26, కాంగ్రెస్‌ నుంచి 17, ఆర్‌ఎల్‌డి నుంచి 6, ఇండిపెండెంట్‌ అభ్యర్థుల్లో 25 మంది కోటీశ్వరులు ఉన్నారని తెలిపింది. 116 మందిపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 171 మంది అభ్యర్థులు తమ పాన్‌ కార్డు వివరాలు వెల్లడించలేదని తెలిపింది. ఇక ఇంటర్‌ లోపు విద్యార్హతలు ఉన్న వారు 268 మంది, డిగ్రీ చదివిన వారు 367 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, 50 సంవత్సరాలలోపు వా రు 493 మంది ఉన్నారు. బరిలో ఉన్న 680 మందిలో 60 మంది మహిళలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com