బతికిన 39 ఏళ్ళలో 20 ఏళ్ళపాటు కవిత్వం రాసి, నాటకంలోని పాత్ర లాగా జీవితంలోంచి నిష్క్రమించిన కవి అలిశెట్టి ప్రభాకర్. 1970 దశకంలో తెలుగు కవిత్వంలో వచ్చిన మినీ కవితా సరళికి ఆకర్షితుడై చేతిలో ఉన్న పెన్సిల్‌ను పక్కన పెట్టి, కలాన్ని పట్టుకున్నాడు. చేపట్టిన కలాన్ని తుది ఊపిరి దాకా విడిచిపెట్టకుండా వందలాది పొట్టి కవితలకు ప్రాణం పోశాడు. సాహసం అనే నిప్పుల మీద కాలాన్ని ఫలంగా వండేందుకు నెత్తుటి ఊటేతో ఊపిరి తీసుకుంటుంది. కష్టాలనే సిరాగా నింపుకునే కలంగా మారి పీడితుడే అణ్వస్త్రంగా, కన్నీళ్ల కు కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. దోపిడీ దారుల గుండెల్లో అగ్నిని రగిల్చిన కవి అలిశెట్టి ప్రభాకర్. పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల ప్రభాకర్ జన్మస్థలం. 12-1-1954న జన్మించారు. చినరాజం, లక్ష్మి వీరి తల్లిదండ్రులు. అలిశెట్టి గారికి ఏడుగురు అక్క చెల్లెల్లు, ఇద్దరు అన్నదమ్ములు ఉ న్నారు. కరీంనగర్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసి ఇంటర్ విద్యను సిద్దిపేటలో చదివారు. అలిశెట్టి గారి తండ్రి తన చిన్నతనంలోనే మరణించడం వల్ల కుటుంబ పోషణ బా ధ్యతలు స్వీకరించాడు.
తన ఆదర్శాలకు అనుగుణంగా ఒక పేదింటి అమ్మాయి అయిన భాగ్యంను వివాహం చేసుకు న్నాడు. మొదట చిత్రకారుడిగా పెన్సిల్‌తో బొమ్మలు గీసి తన జీవితాన్ని ప్రారంభించాడు. పత్రికలకు పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీ నటుల బొమ్మలను వేశాడు. తరువాత జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి అనే సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి అడుగుపెట్టారు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చయిన ఆయన మొదటి కవిత. జీవిక కోసం ఫొటోగ్రాఫర్‌గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. 1978వ సంవత్సరంలో జగి త్యాలలో ''జగిత్యాల జైత్రయాత్ర'' అనే పేరుతో పెత్తందారీ వ్యవస్థ మీద పేదోళ్లు జరుపుతున్న పోరుతో ప్రభాకర్‌లోని అక్షరసూరీడు కొత్త దిక్కున ఉదయించాడు. అందుకే జైత్రయాత్రలో ప్రజల ఉరకలెత్తే ఉత్సాహాన్ని చూసి తనలోని ఆవేశాన్ని ''ఎర్ర పావురాలు'' గా ఎగరవేశాడు. ఇది 1978లో వచ్చిన అలిశెట్టి గారి మొదటి కవితా సంకలనం. అప్పటి నుంచి కవిగా ముందుకు సాగాడు. చివరి రోజుల్లో పేదరికంతో పోరాటం చేసే రోజుల్లోనూ ఆయన దారితప్పలేదు. ఆయన రాసిన కవితా సంకలనా లను సినిమాలకు అమ్ముకునే అవకాశం వచ్చినా ఆయన ఒప్పుకోలేదు. సినిమా కవిగా మారుంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చేవి. కానీ సమాజం కోసం రాస్తాననే మాటకు కట్టుబడి ఉన్నారు. ఫలితంగా క్షయకు చికిత్స చేయించడానికి డబ్బులు లేక 12.1.1993న హైదరాబాద్‌లో కన్నుమూశారు. మృత్యువు దాడి చేసిన రోజు కూడా అక్షరాలకు జీవం పోశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa