రేషన్ కార్డును ఇంకా ఆధార్ కార్డుతో అనుసంధానించాలిని కేంద్రం కోరింది. ఇందుకు సెప్టెంబర్ చివరి వరకు గడువు నిర్ణయించింది. రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసే గడువును ప్రభుత్వం పొడిగించింది. సెప్టెంబర్ 30 తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డుతో లింక్ చేయకుండా ఉంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) కింద లబ్ధిదారుల రేషన్ కార్డు రద్దు చేయబడదని లేదా లబ్ధిదారుల పేరు తొలగించబడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ నంబర్ లేని వారి రేషన్ కార్డులు రద్దు కావని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు (యుటి) మంత్రిత్వ శాఖ స్పష్టమైన సూచనలు జారీ చేసింది. రేషన్, ఆధార్ అనుసంధానించకపోతే రేషన్ ఇవ్వరని వస్తున్న వార్తలను ఎవ్వరూ నమ్మవద్దని హెచ్చరించింది. అవన్నీ ఫేక్ వార్తలని కొట్టిపారేసింది. ఒక వేళ రేషన్, ఆధార్ కార్డు లింక్ చేయకున్నా కూడా వారికి రేషన్ వస్తుందని తెలిపింది.