ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులకు సోషల్ మీడియా ద్వారా పాఠాలు చెప్పాలని భావిస్తోంది.టెన్త్ స్టూడెంట్స్ చదివే పాఠాలను వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా విద్యార్దులకు పంపాలని సర్కార్ ప్రణాళికలు వేస్తోంది. ప్రతి స్కూలుకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయనున్నారు. అందులో విద్యార్దులు, టీచర్లు ఉండనున్నారు. ఆ గ్రూపులోనే అవరసరమైన ప్రాక్టిస్ ప్రశ్నలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు. ఉపాధ్యాయులు తమ క్లాసులను వీడియోలో రికార్డు చేసి యూ ట్యూబ్ లలో పెడుతారు. ఆ లింకులను విద్యార్దుల వాట్సాప్ గ్రూపులలో పెడుతారు. ఆ లింకులు ఓపెన్ చేసి విద్యార్దులు పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వారు తయారు చేసుకునే నోట్స్‌ను వాట్సాప్ లేదా ఈ మెయిల్ ద్వారా టీచర్లకు పంపాలి. పదో తరగతి విద్యార్దులకు జూలై నెలలో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.