లాక్‌డౌన్ ప్రభావం అన్ని రంగాలతో పాటు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పైనా తీవ్రంగా పడింది. కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్స్ ఆగిపోయాయి. గ్లోబల్ మార్కెట్‌లో కొత్త మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి. భారతదేశంలో లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఆ ఫోన్లు ఇండియన్ మార్కెట్లో అడుగుపెడతాయి. లాక్‌డౌన్ తర్వాత మార్కెట్లోకి వచ్చే 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఏవో తెలుసుకోండి.
1. OnePlus 8 & OnePlus 8 Pro: వన్‌ప్లస్ 8 సిరీస్‌లో వన్‌ప్లస్ 8, వస్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వన్‌ప్లస్ 8 ప్రారంభ ధర రూ.41,999. వస్‌ప్లస్ 8 ప్రో ప్రారంభ ధర రూ.54,999.
2. Samsung Galaxy S20 Ultra: సాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో రిలీజ్ అయిన ఫోన్ ఇది. సాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్‌ట్రా ధర రూ.97,900.
3. Apple iPhone SE 2020: యాపిల్ రెండో బడ్జెట్ ఫోన్‌ను ఇటీవల లాంఛ్ చేసింది. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020 ప్రారంభ ధర రూ.42,500.
4. Xiaomi Mi 10: లాక్‌డౌన్ తర్వాత ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు పరిచయం చేయనుంది షావోమీ. రిలీజ్ తర్వాత ధరలు తెలుస్తాయి.
5. Motorola Edge & Edge Plus: మోటోరోలా రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లను రిలీజ్ చేసింది. మోటోరోలా ఎడ్జ్ ప్రారంభ ధర రూ.57,750. మోటోరోలా ఎడ్జ్ ప్లస్ ప్రారంభ ధర రూ.57,750.
6. Huawei P40 & P40 Pro: హువావే రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లను రిలీజ్ చేసింది. లాక్‌డౌన్ తర్వాత ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.
7. Xiaomi Redmi Note 9 Pro & Note 9 Pro Max: షావోమీ నోట్ 9 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు ఇండియాకు రాబోతున్నాయి. రెడ్‌మీ నోట్ ప్రో ప్రారంభ ధర రూ.12,999. రెడ్‌మీ నోట్ ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.14,999.
8. Vivo V19: వివో వీ19 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇండియాలో త్వరలో లాంఛ్ అయ్యే అవకాశముంది.
9. Realme Narzo 10 & Narzo 10A: రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. లాక్‌డౌన్ ఎత్తేయగానే ఈ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. రూ.10,000 బడ్జెట్‌లో ఈ ఫోన్లు ఉండొచ్చని అంచనా.
10. Motorola Razr: మోటోరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మోటో రేజర్ త్వరలో ఇండియాకు రానుంది. ఈ ఫోన్ ధర రూ.1,24,999.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa