ఆల్ ఇండియా కౌన్సిల్ ఫార్ టెక్నికల్ ఎడ్యుకేషన్-ఎఐసిటిఇ ఉచితంగా ఆన్‌లైన్ కోర్సుల్ని అందిస్తోంది. విద్యార్థుల కోసం 49 ఇ-లెర్నింగ్ కోర్సుల్ని ప్రకటించింది. విద్యార్థులు తమకు అభిరుచి ఉన్న అంశాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, కార్పొరేట్ సెక్టార్‌లో కెరీర్ కోసం ప్రయత్నించేవారికి ఈ కోర్సులు ఎంతో మేలు చేస్తాయి. 2020 మే 15 వరకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ జాబ్స్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు ప్రిపరేషన్‌కు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి.
ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ పెంచుకోవాలనుకునే వారికీ 50 గంటల ఛాట్ బేస్డ్ ఇంటరాక్టీవ్ ఆడియో విజువల్ కంటెంట్ అందుబాటులో ఉంది. గేట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యేవారికి 100 గంటల వీడియో లెస్సన్స్ ఉన్నాయి. ఈ కోర్సులన్నీ ఉచితం. ఈ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ free.aicte-india.org/ ఓపెన్ చేయండి. అందులో కోర్సుల జాబితా ఉంటుంది. మీరు నేర్చుకోవాలనుకున్న కోర్సు పైన క్లిక్ చేయండి. కోర్సు వివరాలన్నీ ఓసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత లెర్న్ ఫర్ ఫ్రీ డురింగ్ కోవిడ్ షట్ డౌన్ పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఎన్రోల్ నౌ పైన క్లిక్ చేయండి. మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత కోర్సు ప్రారంభించొచ్చు. ఉచితంగా ఆన్‌లైన్‌లో అందిస్తున్న 49 కోర్సుల జాబితా ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రో టీన్, 2. డిప్లొమా ఇన్ మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్ స్టూడియో, 3. మెషిన్ లెర్నింగ్ యూసింగ్ పైథాన్, 4. డేటా అనలిటిక్స్ యూసింగ్ ఆర్, 5. ఐఎఎఎ: సర్టిఫైడ్ సాఫ్ట్ వేర్ టెస్టింగ్ ప్రొఫెషనల్ - ఫంక్షనల్ టెస్టింగ్, 6.ఐఎఎఎ: సర్టిఫైడ్ యాగిల్ స్క్రమ్ అసోసియేట్, 7.ఎల్ఇఎపి: లెర్నింగ్ ఎక్సెలెన్స్ అండ్ ప్రొగ్రెసిన్, 8. బిగ్ డేటా 101, 9. ఆర్ ప్రోగ్రామింగ్, 10. జావా ప్రోగ్రామింగ్, 11. డేటా సైన్స్ ఫర్ బిగినర్స్ / పైథాన్ ఫర్ డేటా సైన్స్, 12. ప్రోగ్రామింగ్ వర్క్ బెంచ్, 13. డిజిటల్ మార్కెటింగ్, 14. మ్యాట్ ల్యాబ్ ఆన్ ర్యాంప్, 15. మెషిన్ లెర్నింగ్ ఆన ర్యాంప్, 16. డీప్ లెర్నింగ్ ఆన్ ర్యాంప్, 17. ఎఐ / ఎంఎల్ ఇంటర్న్ షిప్, 18. ఏకీడా, 19. ఇంగ్ ఆన్లైన్, 20. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ అండ్ లెర్నింగ్ ప్రోగ్రాం, 21. సర్టిఫైడ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్, 22. మెకానికల్ ఇంజనీరింగ్ ఎస్సెంటిల్ ప్రోగ్రాం, 23. పెర్ఫార్మన్స్ మేనేజ్ మెంట్ అండ్ కంపెటెన్సీ మ్యాపింగ్, 24. ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్, 25. ఆన్లైన్ ఇంటర్న్ షిప్ ఇన్ ఫైనాన్సియల్ ఎనాలిసిస్ బేసిక్స్, 26. ఆన్లైన్ ఇంటర్న్ షిప్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఎనాలిసిస్ స్కిల్స్, 27. గ్రేట్ లెర్నింగ్ అకాడమీ, 28. ఎంటిసి ఇ- లెర్నింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్, 29. ఎడులిబ్, 30.థిక్ టాక్ టు, 31. స్టడీ స్కిల్స్ ప్యాకేజ్, 32. కోర్సెస్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, 33. వర్చ్యువల్ రోబోటిక్స్ టూల్ కిట్ (విఆర్టి), 34. క్యాడ్ యుసింగ్ ఆటోడెస్క్ ఇన్వెంటర్, 35. Xcelerator , 36. స్టాటిస్టిక్స్ 101, 37.క్వాన్సెర్ ఎక్స్పీరియన్స్ కంట్రోల్స్ యాప్, 38. స్ట్రక్చరల్ అండ్ ఫౌండేషన్ ఎనాలిసిస్, 39. నాన్-స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్, 40. ప్రాక్ క్యాంప్, 41. గేట్ ఎగ్జాం ప్రిపరేషన్, 42. ఇంట్రడక్షన్ టు బ్యాంకింగ్, 43. ఇంట్రొడక్షన్ టు యుపిఎస్సీ (NCERT ప్రోడక్ట్), 44. ఎన్ఐ ఆన్లైన్ ట్రైనింగ్ రిసోర్సెస్, 45. ఎన్ఐ బ్యాడ్జ్ ప్రోగ్రాం, 46. ఆన్లైన్ ఇంజనీరింగ్ టీచింగ్ రిసోర్సెస్, 47. అల్ట్రా-కాంకర్రెంట్ రిమోట్ లేబోరేటరీ, 48. ఏమోనే రిమోట్ ల్యాబ్ ఎక్సపెరిమెంట్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, 49. గువి.. వంటి కోర్సులు ఆన్ లైన్ లో ఉచితంగా నేర్చుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa