కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్.. ఆరోగ్యసేతు అనేది జియో ఫీచర్ ఫోన్లలో ఇప్పటి వరకూ అందుబాటులో లేదు. త్వరలోనే జియో ఫోన్ మోడళ్లకూ ఆరోగ్యసేతు యాప్ అందుబాటులోకి రానుంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం గత నెలలో ఆరోగ్యసేతు యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌ను ఇప్పటి వరకు 9 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దేశంలోని 50 కోట్ల మంది ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్ల కోసం ఈ యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ 40 కోట్ల ఫీచర్ ఫోన్ల వినియోగదారులకు మాత్రం ఇది అందుబాటులో లేదు. అయితే, త్వరలోనే 10 కోట్ల మంది జియో ఫోన్ యూజర్లకు మరో వారం లోపే ఈ యాప్ అందుబాటులోకి రాబోతోంది. కెఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్ల కోసం కూడా యాప్ సిద్ధమవుతున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్ పరీక్షల దశలో ఉన్నట్టు సమాచారం. అదిగానీ విజయవంతం అయితే జియోలో ఫింగర్ ప్రింట్ ఆప్షన్ తో ఆరోగ్య సేతు యాప్ త్వరలో రానుంది.