నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖాళీల భర్తీకి భారీగా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 1,070 స్పెషలిస్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, అనస్థీషియాలజీలో ఈ ఖాళీలున్నాయి. సంబంధిత మెడికల్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరితేదీ 2020 మే 7. మొత్తం 1,070 ఖాళీలుండగా జనరల్ మెడిసిన్- 360, పల్మనరీ మెడిసిన్- 363, అనస్థీషియాలజీ- 347 పోస్టులున్నాయి. ఎంపికైన వారికి రూ.1,10,000 జీతం లభిస్తుంది. సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అప్లై చేయాలి. అభ్యర్థుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa