ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రహదోషాలను తొలగించే ఆలయాలివే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 03, 2020, 05:13 PM

గ్రహాలు మొత్తం తొమ్మిది. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహ‌స్పతి, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువు.అయితే కుజ దోషం, శుక్ర గ్రహ దోషం, రాహు దోషం ఇలా ఇలా సర్వగ్రహరిష్టాలు తొలగి పోవడానికి మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి ఆ గ్రహదోషాలు పోగొట్టే ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాంశ్రీకాళహస్తీశ్వరస్వామి దేవాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో శ్రీకాళహస్తి పట్టణం ఉంది. ఈ నగరం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాళహస్తీశ్వరుని గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్య్రం, దోషాలు తొలిగిపోయి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం అందుకే దేశంలోని ఆలయాలన్నీ గ్రహణం రోజున మూతపడినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది.శ్రీసూర్యనారాయణ స్వామి దేవాలయం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకుళం జిల్లాకి రెండు కిలోమీటర్ల దూరంలో అరసవిల్లి అనే గ్రామంలో అతి పురాతనమైన శ్రీ సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం ఉంది. ఇంద్రుడు ఇక్కడ శ్రీ సూర్యభగవానుడిని ప్రతిష్టించి, ఆరాధించి, ఆరోగ్యవంతుడై తిరిగి తన లోకానికి చేరుకున్నాడని ప్రతీతి. అందుకే నవగ్రహాధిపతి ఆయన ఈ స్వామివారిని దర్శిస్తే సర్వగ్రహరిష్టాలు తొలగి శాంతి లభిస్తుందని, చర్మవ్యాధి నిరోధికుడని చర్మ వ్యాధులు అన్ని తొలగిపోతాయని పురాణాలూ చెబుతున్నాయి.భ్రమరాంబ మల్లికార్జున కామాక్షి దేవాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాకు 12 కీ.మీ. దూరంలో, పెన్నానది తీరానజొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షి దేవస్థానం ఉంది. 1150 లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. అనేక బాధలు నివారించగలిగిన శక్తిగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడి అమ్మవారు పేరు గాంచింది. ఈ తల్లిని ఆరాదించేందుకు సాధారణ భక్తులే కాకా, గ్రహ పీడితులు, పిశాచ పీడితులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు, సంతానం లేనివాళ్లు, మానసిక రోగులు ఎందరో వచ్చి అమ్మవారిని దర్శించి తమ బాధలను నుంచి విముక్తి పొంది, సత్ఫాలితాలు పొందినట్లు చెబుతుంటారు.శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, విశాఖపట్నం నడిబొడ్డున వన్ టౌన్ లోని బురుజు పేట యందు వెలసిన ఒక గ్రామదేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని ప్రతి సంవత్సరం చైత్రశుద్ద పాడ్యమి నాడు వెండి ఆభరణములతో అలంకరించి పూజిస్తారు. ఈ అమ్మవారికి గురువారం రోజున కానుకలు సమర్పించి, తమ మనసులోని కోర్కెలు తెలియచేస్తే అవి తప్పక నెరవేరుతయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామం నందు కోనేటిలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం కలదు. ఇక్కడ బ్రహ్మ శివుడు ఇద్దరు ఒకేమూర్తిగా భక్తులకి దర్శనం ఇస్తారు. పురాణాల ప్రకారం బ్రహ్మకు అర్హతలేదు కనుక పరోక్షంగా ఈశ్వరునికి అభిషేకం చేసి అది బ్రహ్మకు చెందేలా రూపొందించబడటం ఈ ఆలయం ప్రత్యేకత.శ్రీ సోమేశ్వర జనార్దనస్వామి ఆలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా భీమవరమునకు 2 కి.మీ. దూరంలో గౌతమి నది తీరాన గునిపూడి గ్రామం లో శ్రీ సోమేశ్వరాలయం ఉంది. ఇక్కడి శివలింగం చంద్రునిచే ప్రతిష్టించబడినందున దీన్ని సోమేశ్వర లింగం అని అంటారు. ఈ ఆలయం తేత్రాయుగం నాటిదని, దీనిని దేవతలు నిర్మించారని చెబుతారు.శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహస్వామి ఆలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, రావూరు మండలం లో నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా 80 కీ.మీ. దూరంలో, రావూరు నుంచి 30 కీ.మీ. దూరంలో గోనుపల్లి గ్రామానికి 7 కీ.మీ. దూరంలో పెంచలకోన అను క్షేత్రంలో పెనుశిలా లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉన్నది. నరసింహస్వామి అమ్మవారిని పెనవేసుకొని ఒక శిలా రూపంలో స్వయంభువుగా వెలసి దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదే అవ్వడం విశేషం. ఎంతో మహిమగల ఈ ఆలయాన్ని సందర్శిస్తే గ్రహపీడలు పోతాయని చెబుతారు.శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలానికి చెందిన అన్నవరం గ్రామంలో పంపానది తీరమున గల రత్నగిరి కొండపైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం ఉంది. అన్నవరం సత్యదేవుడిని దర్శించినా, సత్యనారాయణుడి వ్రతం ఆచరించినా సర్వపాపాలు తొలగిపోతాయనీ, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయిశ్రీ వేంకటేశ్వరస్వామి – ద్వారకా తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, పచ్చిమగోదావరి జిల్లాలోని, ఏలూరు నుండి 42 కి.మీ. దూరంలో ద్వారకా తిరుమల అను గ్రామం ఉంది. ఈ గ్రామంలోని అనంతాచలం అనే కొండపైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకాలు జరగవు. ఎందుకంటే స్వామివారి విగ్రహం క్రింద చీమల పుట్ట ఉంది. ఇక ఈ స్వామివారిని దర్శించడం వలన మోక్షం సిద్ధిస్తుంది. ధర్మార్ధ కామ పురుషార్థములు సమకూరుతాయి. గ్రహ దోషాలు తొలగిపోతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa