మరదలి పై కన్నేసిన బావ ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీఘర్ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో రాంలాల్ తన భార్య,పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. రాంలాల్ భార్య సోదరి వారి ఇంట్లో చదువుకునేందుకు వచ్చింది. వారి ఇంట్లోనే ఉండి కాలేజీకి వెళ్లేది. దీంతో ఆమె పై కన్నేసిన రాంలాల్ ఆమెను దక్కించుకోవాలని ప్రయత్నించాడు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేనీ సమయంలో ఆమెకు స్వీట్లలో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు. దీంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత ఆమె పై రాంలాల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మెలకువ వచ్చిన అనంతరం గమనించిన యువతి తన పై అఘాయిత్యం జరిగిందని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాంలాల్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa