కరోనా ప్రభావంతో వేలాది మంది అన్నం దొరక్క ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అన్నం పెట్టిన వారినే దేవునిగా అన్నార్దులు కొలుస్తున్నారు. శేరిలింగంపల్లిలో శుక్రవారం కొందరు దాతలు బాటసారులకు,యాచకులకు,వలస కూలీలకు ఆహార పొట్లాలు,నీళ్ల బాటిళ్లు పంపిణీ చేశారు. దీంతో ఓ యువతి చిన్నారిని ఎత్తుకొని వచ్చి ఆహార పొట్లాలను అందుకుంది. ఆ తర్వాత ప్రపంచాన్ని జయించిన ఆనందంతో ఆమె ముఖంలో చిరునవ్వు వెరిసింది. దేశమంతా ఈ దృశ్యాలు అనేకం. ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa