ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బయటపడిన కరోనా కొత్త లక్షణం...!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 26, 2020, 02:06 PM

కరోనా లక్షణాలుగా ఇప్పటి వరకూ అందరూ కొన్ని లక్షణాలనే చెప్పుకున్నారు. ఆ లక్షణాలలో జ్వరం, జలుబు, దగ్గు, ఆకలి వెయ్యకపోవడం వంటివి ఉన్నాయి. కరోనా సోకిన చాలా మందిలో ఇవే లక్షణాలు కనిపించాయి కూడా. అయితే తాజాగా మరో లక్షణం బయటపడుతోంది. యూరప్, అమెరికా దేశాల్లో ఆ లక్షణం కనిపించింది. చాలా మందికి అక్కడ కరోనా వ్యాపించే ముందు పిల్లల పాదాలు, బొటనవేళ్లకు వాపులు, కందిపోయినట్లుగా అయిపోవడం, కలర్ మారడం వంటివి జరుగుతోంది. ఆ లక్షణం వచ్చిన రెండు రోజులకు కరోనా బయటపడుతోంది. అయితే ఈ లక్షణం అందరి పిల్లల్లోనూ కనిపించడం లేదు. కొద్ది మంది పిల్లల్లో మాత్రమే ఈ లక్షణం కనిపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa