నిర్లక్ష్యమే ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఆటో చక్రం కింద పడి ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు కథనం మేరకు.. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో ఓ వ్యక్తి కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. పిడుగురాళ్ల నుంచి ఆటోలో కిరాణ సరుకులు తీసుకొచ్చిన ఓ ఆటో డ్రైవర్ ఇంజిన్ ఆపకుండా లోపల సరుకులు పెట్టేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న పిల్లలు ఆటో ఎక్కారు. తెలియక గేరు మార్చడంతో ఆటో ఒక్కసారిగా ముందుకు కదిలింది. మరో చిన్నారి నౌషిన్ ఆ సమయంలో ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఆటో వెనక చక్రం కిందపడింది. తీవ్ర గాయాలతో విలవిల్లాడిపోతున్న బాలికను చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa