బుధవారం నుంచి పదో తరగతి విద్యార్దులకు రేడియోలో పాఠాలను ప్రసారం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దానికి సంబంధించిన షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల 5 నిమిషాల నుంచి 11.35 నిమిషాల వరకు పాఠాలు బోధించనున్నారు.
తెలుగు ఏప్రిల్ 22 నుంచి 24 వరకు
హిందీ ఏప్రిల్ 25 నుంచి 27 వరకు
ఇంగ్లీషు ఏప్రిల్ 28 నుంచి మే 1 వరకు
గణితం మే 2 నుంచి మే 5 వరకు
భౌతిక శాస్త్రం మే 6 నుంచి మే 8 వరకు
జీవశాస్త్రం మే 9 నుంచి మే 11 వరకు
సాంఘిక శాస్త్రం మే 12 నుంచి మే 15 వరకు
ఇప్పటికే విద్యాశాఖ దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో విద్యామృతం పేరిట పాఠాలు చెబుతున్న విషయం తెలిసిందే. రేడియో పాఠాలను ఎఫ్ఎం, రేడియోల ద్వారా అన్ని జిల్లాల విద్యార్దులు వినేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరింది.