ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్‌ డౌన్‌ పాటిద్దాం: మంత్రి శ్రీరంగనాథ రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 20, 2020, 05:29 PM

నరసాపురం (పశ్చిమ గోదావరి) : లాక్‌డౌన్‌ నేపథ్యంలో... నరసాపురం ఆచంట మండలం కొడమంచిలి, ఆచంట గ్రామాలలో చేపడుతోన్న శానిటేషన్‌, ప్రభుత్వ పథకాలు, తదితరవాటిని మంత్రి శ్రీరంగనాథ రాజు సోమవారం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ... కరోనా నియంత్రణ చర్యలతోపాటు లాక్‌ డౌన్‌ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా చర్యలు చేపడుతుందని, ప్రజలు భయపడవలసిన పనిలేదని, ప్రభుత్యం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి రోజు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేయడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ జగన్మోహనరెడ్డి మంత్రులు, వివిధ శాఖల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలంతా సహకరించాలని కోరారు. కరోనా నివారణకు తీసుకోవలిసిన చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని, అందుకు అనుగుణంగా గ్రామాల్లో పర్యటించి పరిశీలన చేసి, ప్రజల నుండి సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ' కరోనాను కట్టడి చేద్దాం.. మన కుటుంబంతోపాటు మన సమాజాన్ని కాపాడుకుందాం.. లాక్‌ డౌన్‌ పాటిద్దాం..కరోనాను జయిద్దాం.. ' అని మంత్రి పిలుపునిచ్చారు. ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప ఎవరు రోడ్లు పైకి రావద్దని, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని మంత్రి సూచించారు. క్వారంటైన్‌ కేంద్రాలలో అన్ని సదుపాయాలను కల్పించామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతీ నియోజకవర్గంలో ఒక క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.ఈ కేంద్రాలలో ఆహరం, వైద్య బృందం, అత్యవసర మందులతో, తదితర సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. కారోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన వ్యక్తులతో కలసిఉన్నవారు, అనుమానితులు ఈ క్వారంటైన్‌ కేంద్రాలలో ఉచితంగా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ప్రజలు ఎలాంటి భయాందోళ చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్యం అండగా ఉంటుందని మంత్రి శ్రీరంగ నాథ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆర్‌వి.కృష్ణా రావు, నాయకులు గొడవర్తి వెంకన్న బాబు, సుంకర సీతారామ్‌, వైట్ల.కిషోర్‌, మట్టా.ఆనంద్‌ కుమార్‌, వేదాల నాగ రాజు, కడలి నారాయణ ప్రసాద్‌, నేక్కంటి. రామలింగేశ్వర రావు, ఉల్లం రామానుజం, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa