ఏపీ సర్కార్ కరోనా కట్టడికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా కరోనా సాయం కింద ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఫ్రీ రేషన్, కుటుంబానికి రూ.1000 సాయాన్ని సర్కార్ అందిస్తుంది. మొదటి విడతలో భాగంగా మార్చి 29న సర్కార్ సాయాన్ని అందించింది. రెండో విడతలో భాగంగా నేటి నుంచి మనిషికి 5 కిలోల బియ్యంతో పాటు కిలో శనగలు ఫ్రీగా ఇవ్వనున్నారు. అదే విధంగా ప్రజలంతా ఒకేసారి షాపు వద్దకు రాకుండా ఉండేందుకు వాలంటీర్లు కూపన్లు ఇచ్చారు. రేషన్ తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 1902 నంబర్ కు కాల్ చేయవచ్చని సర్కార్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa