ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి . నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 502కి చేరుకుంది. 114 కేసులతో గుంటూరు జిల్లా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలు జిల్లా 96 కేసులతోనూ, నెల్లూరు జిల్లా 54 కేసులతోనూ ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa