ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తునట్టుగా ప్రకటించారు. దీంతో కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో మే 3వరకు విమాన సర్వీసులను నిలిపివేస్తూ విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశ,అంతర్జాతీయ సర్వీసులన్నింటికి ఈ ఆదేశాలు వర్తిస్తాయి. దీంతో మే 3 వరకు ఇండియాలో ఏ విమానాలు కూడా ల్యాండ్ కావు. దీంతో విదేశాల్లో ఉన్న భారతీయులు భారత్ కు రావాలంటే మే 3 వరకు నిరీక్షించక తప్పదు. మే 3 తర్వాత పరిస్థితులను సమీక్షించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని విమానయాన శాఖ తెలిపింది. ఇప్పటికే రైల్వే శాఖ మే 3 వరకు సర్వీసులను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడవనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa