ఎడ్జ్బస్టన్: ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరన్ ఫించ్ ఇంగ్లండ్తో జరుగుతున్నవన్డేలో హాఫ్ సెంచరీ చేశాడు. 47 బంతుల్లో ఏడు బౌండరీలతో 50 రన్స్ చేశాడు ఫించ్. ప్రస్తుతం ఆస్ట్రేలియా 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 93 రన్స్ చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. వార్నర్ 21 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆస్ట్రేలియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్కు వెళ్తుంది.