కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మద్యం బాబులు మందు దొరక్క విలవిలలాడిపోతున్నారు. అయితే రెండు రాష్ట్రాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు తెరవాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అసోం,మేఘాలయ రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశాయి. వీటికి సంబంధించి కొన్ని కండీషన్లు పెట్టాయి.
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైన్స్ షాపులు తెరిచి ఉంచాలి.
- మద్యం కొనుగోళ్లకు వచ్చిన వారు తప్పకుండా సామాజిక దూరం పాటించేలా చూడాలి.
- మద్యం ఇచ్చేటప్పుడు, నగదును తీసుకునేటప్పుడు శానిటైజేషన్ పాటించాలి.
- దగ్గు, జలుబు, జ్వరం లాంటివి ఉంటే ఉద్యోగులకు విధులు అప్పగించొద్దు.
- డిస్టిలరీలు, బ్రేవరీలు, బాటిలింగ్ ప్లాంట్లలో రోజు వారీ విధులు నిర్వర్తించే వారిలో 50 శాతం మందితోనే పనిచేయించుకోవాలి. పని చేసే వారికి భోజనం కంపెనీలే అందించాలి.
- మద్యం దుకాణాలు పోలీసులకు, జిల్లా యంత్రాంగం సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
- మద్యం సరఫరా చేసే వాహనాలు తప్పనిసరిగా పాస్‌లు పొందాలి.
- ఒకవేళ మద్యం కోసం ఎక్కువ మంది వస్తే... ఆ దగ్గరలోని షాపునకు డైవర్ట్ చేయాలి. తోపులాట లాంటివి ఉండకూడదు.
- నిబంధనలు ఉల్లంఘించిన మద్యం దుకాణం లైసెన్స్ ప్రభుత్వం రద్దు చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa