ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి (07-04-2020) రాశిఫలాలు...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 07, 2020, 11:32 AM

మేషం : కిరాణా ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి ఆశాజనకం. షాపింగ్ దుబారా ఎక్కువుంగా ఉండే అవకాశం ఉంది. ఎదుటివారి తీరును గమనించి ముందుకుసాగండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


వృషభం : ఉపాధ్యాయ రంగాల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారాల పట్ల దృష్టిసారిస్తారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. స్త్రీల ఆరోగ్యంలో సంతృప్తికానరాదు.


మిథునం : ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. బంగారు, వెండి, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరులతో అవగాహన కుదరదు. స్త్రీలతో సంభాషించునపుడు సంయమనం పాటించండి. అన్నీ లాభదాయకంగానే ఉంటాయి. మీకు నచ్చిన విషయాలపై దృష్టిపెడతారు.


కర్కాటకం : విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.


సింహం : వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. సహోద్యోగుల కారణాల వల్ల మీ కార్యక్రమాలు వాయిదాపడతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు చేపట్టిన పనులు సక్రమంగా నిర్వహించలేకపోవడం వల్ల ఒకింత ఒత్తిడికి గురవుతారు. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు.


కన్య : బ్రోకర్లకు, ఏజెట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి తప్పదు. కొన్ని బంధాలను నిలుపుకోవడానికి శ్రమించాల్సివస్తుంది. బ్యాంకులు, లావాదేవీలకు అనుకూలం. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించుట మంచిది.


తుల : పత్రిక, ప్రైవేటు సంస్థలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి.


వృశ్చికం : ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. విద్యార్థులు కొత్త ఆలోచనలు చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు ప్రయాణాలు వాయిదాపడతాయి.


ధనస్సు : ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. నూతన గృహం కొనుగోలుకై చేయు యత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా గడుపుతారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచివి కాదని గమనించండి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు.


మకరం : స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, అధిక ఒత్తిడి తప్పదు. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. మీరు చేసే పనులపై ఇతరుల దృష్టి ఉంటుంది. జాగ్రత్త వహించండి.


కుంభం : భాగస్వాముల మధ్య అసందర్భపు మాటలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి శుభం చేకూరుతుంది. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వహించలేకపోతారు.


మీనం : ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. కుటుంబంలోని కొన్ని మార్పులు భావోద్వేగాలకు గురిచేస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ఆటోమొబైల్, రవాణా, మెకానికల్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa