ఆధార్ సేవల్ని సామాన్యులకు వీలైనంత వేగంగా అందుబాటులో ఉంచేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా- యుఐడిఎఐ కృషి చేస్తోంది. ఎస్ఎంఎస్ ద్వారా అనేక రకాల ఆధార్ సేవలు పొందొచ్చు. ఇందుకోసం ఆధార్ ఎస్ఎంఎస్ సర్వీస్‌ని అందిస్తోంది యూఐడీఏఐ. ఎస్ఎంఎస్ ద్వారా మీరు ఆధార్ సేవలు పొందాలనుకుంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ ద్వారా మీరు వర్చువల్ ఐడెంటిటీ జనరేట్ చేయొచ్చు. మీ ఆధార్ నెంబర్‌ను లాక్, అన్‌లాక్ కూడా చేయొచ్చు. ఇందుకోసం మీరు యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్‌లోనే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 0123 4567 8910 అయితే ఆధార్ సేవల్ని పొందేందుకు ఏఏ ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలో తెలుసుకోండి. వర్చువల్ ఐడీ క్రియేట్ చేయడానికి మీరు 1947 నెంబర్‌కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపాలి. జీవిఐడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్‌లోని చివరి నాలుగు డిజిట్స్‌ని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అంటే జివిఐడి 8910 అని టైప్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్‌కు వర్చువల్ ఐడీ వస్తుంది. ఒకవేళ మీ వర్చువల్ ఐడీ మర్చిపోయినట్టైతే రిట్రీవ్ చేయొచ్చు. ఇందుకోసం ఆర్వీఐడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్‌లోని చివరి నాలుగు డిజిట్స్‌ని ఎస్ఎంఎస్ చేయాలి. ఇక ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ లాక్ చేయడానికి గెట్ ఓటీపీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్‌లోని చివరి 4 నెంబర్లను టైప్ చేయాలి. అంటే గెట్ ఓటీపీ 8910 అని టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. యుఐడిఎఐ నుంచి మీకు 6 అంకెల ఓటీపీ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. ఆ తర్వాత లాక్ యుఐడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు, మళ్లీ స్పేస్ ఇచ్చి 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి. మీ ఎస్ఎంఎస్ సక్సెస్‌ఫుల్‌గా వెళ్లిన తర్వాత మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్లకు రిజిస్టర్ చేసి ఉంటే ఆధార్ నెంబర్‌లోని చివరి 8 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ అన్‌లాక్ చేయడానికి గెట్ ఓటీపీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు ముందే క్రియేట్ చేసిన వర్చువల్ ఐడీ నెంబర్‌లోని చివరి 6 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎస్ఎంఎస్ పంపిన తర్వాత మీకు 6 అంకెల ఓటీపీ ఎస్ఎంఎస్ వస్తుంది. తర్వాత అన్ లాక్ యుఐడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి వర్చువల్ ఐడీలో చివరి 6 అంకెలు మళ్లీ స్పేస్ ఇచ్చి 6 అంకెల ఓటీపీ టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. ఎస్ఎంఎస్ వెళ్లిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అన్‌లాక్ అవుతుంది. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్లకు రిజిస్టర్ చేసి ఉంటే వర్చువల్ ఐడీలోని చివరి 10 అంకెల్ని టైప్ చేయాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa