మేషం : ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావుడి అధికంగా ఉంటాయి. ఒక విషయంలో సోదరులతో విభేదిస్తారు. ఆర్థాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఊహించని ఖర్చులు అధికం కావడం వల్ల ఆందోళన తప్పదు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి.
వృషభం : వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహనచోదకులకు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీల ఆరోగ్యం కుదుటపడటంతో వారిలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది.
మిథునం : ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులు కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. మిత్రులతో మనసు విప్పి మాట్లాడుకుంటారు.
కర్కాటకం : భాగస్వామిక సమావేశాలలో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. తలపెట్టిన పనులు ఆలస్యమైన పూర్తిచేస్తారు. స్త్రీలు అయిన వారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు.
సింహం : హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. వస్త్ర, బంగారు, వెండి, లోహ, వ్యాపారస్తులకు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో మంచిపేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. గృహంలో మార్పులు వల్ల కొంత అసౌకర్యానికి గురవుతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య : బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగస్తులు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల మాటపడక తప్పదు. నిత్యావస వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడుతారు. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు.
తుల : చేపట్టిన పనులలో స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనా పట్టుదలతో శ్రమించి విజయవతంగా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక స్థితికి ఆటంకంగా నిలుస్తాయి. లీజు, ఏజెన్సీ, నూతన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి.
వృశ్చికం : ప్రముఖులతో ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆంతరంగిక వ్యాపారాల విషయాలు గోప్యంగా ఉంచండి. ఆకస్మిక ప్రయాణాలలో చికాకులు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.
ధనస్సు : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఉత్సాహం, ఏకాగ్రత ఏర్పడతాయి. క్రయ, విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
మకరం : బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. ఉద్యోగస్తులకు యాజమాన్యంతో అవగాహన లోపిస్తుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు శుభదాయకంగా ఉంటుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. తలపెట్టిన పనిలో అధికంగా శ్రమించి విజయాన్ని పొందుతారు.
కుంభం : ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్య ఒకటి మిత్రుల ద్వారా పరిష్కారం కాగలదు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారినుంచి అభ్యంతరాలెదురవుతాయి. ఆస్తి వ్యవహారాలలో ముఖ్యుల మధ్య అవగాహన లోపించడంతో ఒత్తిడికి లోనవుతారు.
మీనం : మీ కుటుంబీకుల వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. హామీలు, చెక్కుల జారీలో ఏకాగ్రత వహించండి. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa