‘దంగల్’ ఫేం ఫాతిమా సనా షేక్ ఒక వివాదంలో చిక్కుకుంది. చెయ్యకూడని పని చేశావంటూ నెటిజన్లు ఆమెపై నిప్పులు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె.. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్లు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా షూటింగ్ నిమిత్తం ద్వీపదేశం మాల్టాలో ఉంటుంది. అక్కడి సముద్ర తీరంలో స్విమ్సూట్ ధరించి సనా ఓ ఫొటోషూట్ చేసింది. హీరోయిన్లు ఇలాంటి షూట్లు చేయడం సహజమే కానీ ఫాతిమా సనా ముస్లిం కావడం, అందులోనూ ఇది రంజాన్ మాసం కావడం వివాదానికి దారితీసింది
‘ఇస్లాంను పాటించే నువ్వు(ఫాతిమా సనా) పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి ఫొటోలు దిగి మమ్మల్ని బాధపెట్టావు. ఈ ఒక్క మాసం అయినా నువ్విలాంటి పని చేయకుండా ఉండాల్సింది. అంటూ కొందరు ఆమెపై కామెంట్ల చేయగా, మరికొందరు మాత్రం ‘ఇందులో తప్పేముంది? నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఆమెకు ఉందని సనాను సమర్థించే ప్రయత్నం చేశారు. ఈ వివాదంపై అటు సనాగానీ, ఇటు ‘ఠగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ యూనిట్గానీ స్పంధించుటలేదు