ప్రభుత్వంతో కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చల్లో భాగంగా తమ వద్దకు వచ్చిన ప్రతిపాదనలను చర్చించిన సచివాలయ ఉద్యోగ సంఘం ఈ మేరకు విశాఖ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా చేపట్టిన విశాఖ తరలింపుకు ఆమోదం తెలుపుతున్నట్లు ఉద్యోగసంఘాలు ఇవాళ ప్రకటించాయి. మే 31లోగా తమను విశాఖకు తరలించాలని ఉద్యోగులు ప్రభుత్వానికి ఓ తీర్మానం పంపారు. అయితే ఈప్రక్రియ ను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేస్తున్నదా అనేది సందేహంగా మారింది.ఏపీ సచివాలయంలో ఉన్న విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ రెండింటిని కర్నూలుకు తరలిస్తూ సీఎస్ నీలం సాహ్నీ ఇచ్చిన ఆదేశాలు సైతం వివాదాస్పదమయ్యాయి. వీటిపై ఇప్పటికే హైకోర్టు పలుమార్లు విచారణ జరిపి జిఓ 13ను సస్పెండ్ చేసింది . మరోవైపు తమ అనుమతి లేకుండా కార్యాలయాలను తరలిస్తే దానికి అయిన ఖర్చును సదరు అధికారుల నుంచే వసూలు చేస్తామని హైకోర్టు హెచ్చరికలు కూడా చేసింది. ఈ పరిణామాలతో కార్యాలయాల తరలింపును జీవోల ద్వారా చేపట్టే పరిస్ధితి కనిపించడం లేదు.ప్రధాని మోదీ బాటలో పవన్ కళ్యాణ్... 22న కీలక నిర్ణయం...ప్రధాని మోదీ బాటలో పవన్ కళ్యాణ్... 22న కీలక నిర్ణయం...వైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలువైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలుశెభాష్... వారిపై సీఎం జగన్ ప్రశంసల జల్లు...శెభాష్... వారిపై సీఎం జగన్ ప్రశంసల జల్లు...Corona Effect | ‘ఎక్స్‌ట్రా’ చేస్తే ఊరుకోను... వారికి జగన్ హెచ్చరికCorona Effect | ‘ఎక్స్‌ట్రా’ చేస్తే ఊరుకోను... వారికి జగన్ హెచ్చరికజగన్ సర్కారుకు ఝలక్... ఆ జీవోపై హైకోర్టు బ్రేక్..జగన్ సర్కారుకు ఝలక్... ఆ జీవోపై హైకోర్టు బ్రేక్..కేవలం రెండు కార్యాలయాలను తరలించేందుకు జారీ చేసిన జీవోనే హైకోర్టు సస్పెండ్ చేస్తే... భవిష్యత్తుల్లో మొత్తం సచివాలయాన్ని తరలించేందుకు ఇచ్చే ఆదేశాల మీద న్యాయస్థానాల నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయనేది ఊహించడం కష్టం కాదు. ఈ పరిస్థితుల్లో మే 31లోపు ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో అధికార వికేంద్రీకరణకు ఉద్దేశించిన రెండు బిల్లులను సెలక్ట్ కమిటీ పేరుతో పెండింగ్ లో పెట్టిన శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీ కేంద్రానికి తీర్మానం చేసి పంపింది. అయితే ఇంతవరకూ దాన్ని కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. కాబట్టి మండలి రద్దు వ్యవహారం ఎటు నుంచి ఎటు తిరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్ధితి.స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు ఎస్ఈసీ నిర్ణయాన్ని సమర్ధించటం, ఆరు వారాల గడువు అంటే మే మొదటి వారంలో మళ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినా మే నెలాఖరు వరకు పడుతుంది. మరోవైపు మార్చి నెలాఖరులోపు ఓటాన్ అకౌంట్ బడ్డెట్ కచ్చితంగా ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకోవాల్సిందే. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ ఖర్చులకు కూడా అనుమతి ఉండదు.మరోవైపు ఎన్నికల నిర్వహణ సగంలో నిలిచిపోవడంతో ఎన్నికల కోడ్ తొలగిపోయినా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ఈసీ అనుమతి తప్పనిసరిగా మారింది. రాజధాని తరలింపులోనూ ఈసీ అభ్యంతరాలు చెబితే ఇక సమస్యల్లో చిక్కుకున్నట్లే.మే నెల లోపు అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించాలంటే ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభం కావాలి, కానీ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో వ్యవస్ధలన్నీ స్తంభింప చేయాల్సిన పరిస్ధితి. మొన్న ఎన్నికలు వాయిదా పడితే, ఆ తర్వాత గుళ్లు తాజాగా స్కూళ్లు, కాలేజీలు మూత పడుతున్నాయి. దీంతో రేపు ఎన్నికల నిర్వహణే కాదు రోజువారీ కార్యక్రమాల నిర్వహణ కూడా సాధ్యం కాని పరిస్ధితులు వస్తాయోమేనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఆ లోపు పార్లమెంటులో మండలి రద్దు బిల్లు ఆమోదం పూర్తి కావాల్సి ఉంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa