ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైకిల్‌ తొక్కండి - నడవండి ఆరోగ్యంగా జీవించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2017, 01:05 AM

  నరసాపురం, మేజర్‌న్యూస్‌ : ఆరోగ్యమే - మహా భాగ్యమని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. మంగళవారం ఆయనప్రపంచ  పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్బముగా పర్యావరణ పరిరక్షణ  అవగాహన అనే అంశంపై బిజిబిఎస్‌ మహిళా కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ పోగ్రామ్‌ ఆఫీసర్‌  మంగళగిరి హరిప్రసాద్‌ రూపొందించిన కరపత్రాన్ని ఆయన బ్రోచర్‌ను విడుదల చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటేనే మనము ఏదైనా చేయగల మన్నారు.  చక్కటి ఆరోగ్యం కలిగిఉండాలంటే మన కు ఉనన ఆర్బాటాల్ని ప్రక్కన బెట్టి సైకిల్‌ తొక్కడం, నడవడం , చెట్ల ను పెంచ డం తదితరమైనవి అలవాటుగా మార్చుకోవాలన్నారు. నేటి రోజులలో క్రమేపి సాంకేతిక, యాంత్రిక, వ్వాపార రంగాలు వేగంగా అభివృద్ది చెంది ఎంతో మందికి ఉపాధి కల్పవృక్షాలుగా, అండగా నిలిచాయని ఈ ప్రగతిని స్వాగ తిస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నామని ఎమ్మెల్యే బండారు అవేదన వ్వక్తం చేసారు. ఆరోగ్య పరిస్థితి చేదాటిన తరువాత లక్షల రూపాయలను ఆసుప త్రులకు ఖర్చు చేస్తూ అప్పలు పాలవౌతున్నామన్నా. జీవితంలో నిజమైన ఆనందాన్ని కోల్పోయే పరిస్ధితులు మనమే కల్పించుకుం టున్నామన్నారు. మన పెద్దలు మూడు పూటలూ తినగలిగితే మనం రెండు ఇడ్లీలను తినలేకపోతున్నా మన్నారు. బలమైన ఆహారం కాకుండా చెత్తవంటి ఆహారం వైపు ఆకర్షింపబడు తున్నామన్నారు. ఈ పరిణామాలకు కారణం శరీరానికి అవసరమైన శ్రమ లేకపోవ డమే నన్నారు. సాంకేతిక, యాంత్రిక, వ్వాపార ఇతర అభివృద్ధికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని ఒక విషయం గుర్తిస్తే సరిపోతుందని ఆదేమిటంటే ఈ  రంగాలలో మెదడుకు మాత్రమే పని ఉందని, శరీరానికి లేదని గుర్తించాలని, దీనికోసం మనం ఏమి చేయాలంటే నిత్య జీవితంలో ఆర్బా టాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యానికి చేరువకావడానికి అవసరమైతే తప్ప మెటార్‌ వాహనా లకు దూరంగా ఉంటూ సైకిల్‌ తొక్కడం, నడవడం, ఆక్సిజన్‌ అందిం చే చెట్లను పెంచడం, పర్యా వరణ పరిరక్షణకు ప్రాదాన్యత ఇస్తే సరిపో తుందన్నారు. మరో ప్రక్క విధ్యార్ధి దశ నుండే ఎల్‌.ె.జి నుండి పాఠశాలల్లో సైతం ఆటలు లేకపోవడం కూడా అనారో గ్యానికి  బాట వేస్తుందనే విషయం ప్రతిఒక్కరూ గుర్తించా లని ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. ఈ కారణా లతో రాష్ట్రంలో, దేశంలోనూ ఘగర్‌ వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజు రోజుకు ఆందోళన కలిగించే స్ధాయికి చేరుకుంటుందని ఎమ్మెల్యే బండారు ఆవేదన వ్వక్తం చేసారు.  


   చక్కటి ఆరోగ్యం కొరకు సైకిల్‌ తొక్కండి, నడక కూడా ఆరోగ్యానికి ద్వారమనే విషయం మరిచిపోవద్దని, మనకు అవసరమైన ఆక్సిజన్‌ ఇచ్చే చెట్లను పెంచి భవిష్యత్‌ తరాల వారికి చక్కటి వాతావరణం కల్పించండి, అంటూ విధ్యార్ధినీ లకు సూచించారు. మన ఆరోగ్యం మన చేతులలో ఉందని ఆరోగ్యంగా జీవిం చేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. ప్రజలకు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించే రీతిలో కరపత్రాన్ని రూపొందించిన బిజిబిఎస్‌ మహిళా కళాశాల అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ పొగ్రాం ఆఫీసర్‌ను ఎమ్మెల్యే బండారు అభినందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com