వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబులు పేలిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన కర్నూలు జిల్లా సంజామల మండలం అక్కంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa