న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇటీవల నాలుగు రోజులపాటు నిర్వహించిన బిగ్ 10 సేల్కు విపరీతమైన స్పందన వచ్చింది. అది ముగిసి రెండు వారాలు కూడా అయిందో లేదో మరోసారి 80 శాతం రాయితీతో సమ్మర్ షాపింగ్ డేస్ పేరుతో ముందుకొచ్చింది. నేటి నుంచి (29వ తేదీ) ఈ నెలాఖరు వరకు ఇది కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్స్, ఆటో యాక్సెసరీస్లపై 80 శాతం రాయితీ ఆఫర్ చేస్తోంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, కార్డులపై కొనుగోళ్లపైనా ఆఫర్లు ప్రకటించింది. గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్లపైనా బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈనెల 18న ఫ్లిప్కార్ట్ బిగ్ 10 సేల్ నిర్వహించగా అంతకు కొన్ని రోజుల ముందు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.