గువహటి : ముస్లిం మతస్తుల ఇళ్లలో వివాహాది శుభకార్యాలు జరగాలంటే మరుగుదొడ్డి తప్పని సరి అంటూ ప్రకటించారు మూడు రాష్ట్రాలకు చెందిన మతపెద్దలు, గురువులు. ఇంట్లో మరుగుదొడ్డి లేదా…అయితే మీ ఇంట్లో వివాహ కార్యక్రమాన్ని జరిపించం అటుంన్నారు ముస్లిం మతపెద్దలు గురువులు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన మత గురువులు, పెద్దలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని మిగిలిన రాష్ట్రాలకు కూడా వర్తింప చేస్తామని వారు చెబుతున్నారు.