ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నైలో రజనీకాంత్‌ అభిమానుల భారీ ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 23, 2017, 04:58 PM

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మద్దతుగా ఆయన అభిమానులు చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించారు. రజినీ కాంత్ తమిళుడు కాదని, ఆయన రాజకీయాల్లోకి రావొద్దని నిన్న కొన్ని తమిళ సంఘాలు నిరసన చేపట్టాయి. దీంతో వారికి వ్యతిరేకంగా రజినీ అభిమానులు రోడ్లపైకి వచ్చారు.  ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు చేశారు.  చెన్నైలోని వాషన్ మెన్ పేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమిళ మున్నెట్ర పడై  దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com