ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్యాణ్‌క‌ష్ణకు వార్నింగ్ ఇచ్చా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 23, 2017, 11:09 AM

నా పాత్రపేరు భ్రమరాంబ రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో నా పాత్ర పేరు భ్రమరాంబ. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం. పాత సినిమాల్లో హీరోయిన్లకు ఇలాంటి ప్రాధాన్యత ఉండేది. నేనొస్తాంటే వొద్దంటానాలో త్రిష, నిన్నే పెళ్లాడుతాలో టబూ పాత్ర మాదిరిగా ఉంటుంది. చాలా లవబుల్ క్యారెక్టర్. నా కోసం ఎవరో ఒక రాజకుమారుడు వస్తాడు అనే ఎదురు చూస్తుంటుంది. నాపై నమ్మకంతో అలాంటి పాత్రను ఇచ్చిన దర్శకుడు కల్యాణ్ కృష్ణకు థ్యాంక్స్. చాలా ఇంపార్టెంట్ రోల్.. గతంలో నేను చేసిన సినిమాలలో పాత్రల పేర్లు గుర్తుంచుకోవాలంటే చాలా కష్ణపడాల్సి వస్తుంది.


కానీ భ్రమరాంబ పాత్ర ఇప్పుడు నాతోనే తిరుగుతున్నది. ఈ పాత్రలో నటించడం ద్వారా నేను పూర్తిగా భ్రమరాంబగా మారిపోయాను అనే ఫీలింగ్ కలుగుతుంది. నా పాత్రకు తగినట్టు పర్టిక్యులర్ డైలాగ్ ఉంటుంది. చాలా సినిమాలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం ఉండదు. కానీ ఈ చిత్రంలో నా పాత్రకు అంత ప్రాధాన్యం ఉంది. సినిమా షూటింగ్ తర్వాత ఆ పాత్రను మరిచిపోవడానికి చాలా కష్టంగా మారుతుంది. ట్రైలర్‌తోనే నా పాత్రకు చాలా గుర్తింపు వచ్చింది. భ్రమరాంబ క్యారెక్టర్ ఓ చిన్న ఊర్లో భూస్వామి కుటుంబంలో ఉండే కూతురి పాత్ర. ఈ పాత్ర చాలా క్యాచీగా ఉంటుంది. నా పాత్రకు, పాత్రకు తగినట్టుగా దస్తులు డిజైన్ చేసిన నీరజ్ కోనకు థ్యాంక్స్.


కల్యాణ్‌క‌ష్ణకు వార్నింగ్ ఇచ్చా.. భ్రమరాంబ పాత్ర ఇచ్చిన దర్శకుడు కల్యాణ్ కృష్ణకు బిగ్ థ్యాంక్స్. కల్యాణ్ నైస్ పర్సన్. ఓపెన్ మైండెడ్. భ్రమరాంబ స్లయిల్‌లో అల్రెడీ కల్యాణ్ కృష్ణకు వార్నింగ్ ఇచ్చాను. నీవు తీయబోయే సినిమాలో నేనే హీరోయిన్. నాకు సంబంధం లేదు. లేకపోతే ఏమీ చేస్తానో నాకే తెలియదు. ఎనీ హో కల్యాణ్‌కు బెస్టాఫ్ లక్ అని రకుల్ అన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com