అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానీయా ట్రంప్ మధ్య ఓ ఇబ్బందికర సన్నివేశం చోటుచేసుకున్నది. ఇజ్రాయిల్ టూర్ వెళ్లిన ట్రంప్ జంటకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని బెంజమెన్ నెతాన్యూ, ఆయన భార్య ట్రంప్ జంటకు స్వాగతం పలికేందకు ఎయిర్పోర్ట్ వచ్చారు. అక్కడ రెడ్‌కార్పెట్‌పై ట్రంప్, మెలానీయాలు విచిత్రంగా ప్రవర్తించారు. విమానం దిగన తర్వాత కలిసి నడుస్తున్న ట్రంప్ తన ఎడమ చేతితో మెలానీయా అర చేయిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ మెలానీయా మాత్రం ట్రంప్ చేయిని పక్కకునెట్టివేసింది. మీడియా కెమెరాల ముందే మెలానీయా ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యం వేసింది. ఇద్దరి మధ్య బాడీ లాంగ్వేజ్ సరిగా లేదని అనుమానాలు వస్తున్నాయి. పక్కపక్కనే నడుస్తున్న మెలానీయా ఎందుకు అలా చేసిందో అర్థం కావడం లేదు. రెడ్‌కార్పెట్‌పై ఇద్దరూ దూరం దూరంగా నడిచారు. దీనిపై వైట్‌హౌజ్ కూడా ఇంకా స్పందించలేదు. ప్రొటోకాల్ ప్రకారం చేయి పట్టుకోవాలో లేదో తెలియదు. కానీ గతంలోనూ ఇద్దరి మధ్య ఇలా స్పష్టమైన విభేదాలు కనిపించాయి.