ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజనీకాంత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 02:11 PM

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన రాజకీయాల్లోకి రావొద్దంటూ పలు తమిళ సంఘాలు ఆందోళనకు దిగాయి. చెన్నైలోని రజనీకాంత్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. రజనీకాంత్ తమిళ వ్యక్తి కాదని, కర్నాటకకు చెందిన వాడని, అలాంటిది తమిళనాడును ఎలా పాలిస్తాడని ప్రశ్నిస్తూ ఆందోళనకారులు ప్రశ్నించారు. దీంతో రజనీ ఇంటి వద్ద భద్రతను భారీగా పెంచారు. అయినప్పటికీ వారు ఇంటిలోకి చొచ్చుకురావడంతో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఇటీవల వరుసగా అభిమానులతో చెన్నైలో సమావేశమైన రజనీకాంత్… ప్రస్తుత రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో పుట్టి, పెరిగినా 42 ఏళ్లుగా చెన్నైలో ఉంటున్న తనను అభిమానులు తమిళుడిగా మార్చారని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి అడ్డంకిగా ఉన్న తమిళేతరుడు అనే ముద్రను చెరిపేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో, ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమని తేలిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com