సీఎం జగన్ అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ, దిశ చట్టం పై వరుస సమీక్షలు నిర్వహించారు. ఉదయం 10.30 నిమిషాలకు గృహ నిర్మాణ శాఖ పై ఆయన సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అధికారులు హాజరయ్యారు. ఉగాదికి పేదలకు ఇవ్వనున్న ఇళ్ల పట్టాల పై సమీక్షించారు. అనంతరం 11 గంటలకు దిశ యాక్ట్ పై సమీక్ష నిర్వహించారు. దిశ చట్టం అమలు, ఇబ్బందుల పై ఆయన సమీక్షించారు. ఈ సమావేశానికి హొంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర అధికారులు హాజరయ్యారు. మధ్యాహ్నం 3.30కి 27వ తేదీ జరిగే కేబినేట్ భేటికి సంబంధించి అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa