ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీమకు నీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2017, 01:57 AM

నదుల అనుసంధానం వల్లే  సీమకు నీరు


చిత్తూరు, మేజర్‌న్యూస్‌ : నదుల అనుసంధానం వల్లే సీమకు నీరు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. రొంపిచర్ల మండలం నగిరి దళితవాడలో నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. అయ్యవాం డ్లపల్లెలో రెండెకరాల్లో చెరువు తవ్వి 50 ఎకరాల మామి డి తోటలకు డ్రిప్‌తో నీటిని అందిస్తున్నారు.రూ.4 కోట్లతో చెరువులు నింపేందుకు ప్రాజెక్టు నిధులను మం జూరు చేస్తామని చెప్పారు. రొంపిచర్లలో షాదీఖానా, రోడ్డు వెడల్ప కోసం నిధులు మంజూరు చేశారు. జిల్లాలో 37 శాతం తక్కువ వర్షం పడినా వ్యవసాయంలో 14 శాతం వృద్ధి సాధించామని సీఎం పేర్కొన్నారు. రైతులు సహక రిస్తే సంక్షోభాలను అధిగమిస్తామని చంద్రబాబు అన్నారు.


సీమను కరువు రహిత జిల్లాగా చేస్తా : రాయలసీమను కరువు రహిత రాష్ట్రంగా చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తొలి రోజు పుత్తూరు సిద్దార్థ కాలేజీలో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారంనాడు పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభిం చనున్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం శుక్రవారమే జిల్లాకు చేరుకున్నారు.  రొంపిచర్ల మం డలం నగిరి దళితవాడలో రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రచ్చబండ కార్య క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న మూడు కుటుంబాలకు రూ.2 చొప్పున లక్షల ఆర్థికసా యాన్ని చంద్రబాబు ప్రకటించారు. ముగ్గురు దివ్యాం గులకు ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు.


కేసుల ఎత్తివేత కోసం జగన్‌ మోకారిల్లారు : ప్రత్యేక హోదా కోసం తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయి స్తానన్న జగన్‌ో్మహన్‌రెడ్డి తనపై ఉన్న ఆయా కేసుల నుంచి బయటపడేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సరెం డర్‌ అయ్యారని చంద్రబాబు విమర్శించారు. తాను రాష్ట్రాభివృద్ధికోసమే ప్రత్యేకహోదా విషయంపై రాజీ పడ్డానని, ప్యాకేజీకి అంగీకరించానే  తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. రైతులు సహకరిస్తే సంక్షోభాలను అధిగమి స్తామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదిలో 2 లక్షల 50 వేల ఎకరాల్లో బిందు సేద్యానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన అన్నారు. ఇప్పటికే అయ్యవాండ్లపల్లెలో రెండెకరాల్లో చెరువు తవ్వి 50 ఎకరాల మామిడి తోటలకు డ్రిప్‌తో నీటిని అందిస్తున్నామని ఆయన అన్నారు. నీరు, ప్రగతి కోసం ఉద్య మం చేశానని, ఈ ఉద్యమంలో 3,500 పనులు చేయబోతున్నామని చెప్పారు. ఒక లక్ష పంట సంజీవని కింద, పంట కుంటలు తవ్వబోతున్నామని, నదుల అనుసంధానం వల్లే సీమకు నీరు ఇస్తున్నామని చెప్పారు. రూ.4 కోట్లతో చెరు వులు నింపేందుకు ప్రాజెక్టు మంజూరు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. రొంపి చర్లలో షాదీఖానా, రోడ్డు వెడల్ప కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలి పారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్య ఉండకూడదని, రౌడీయిజాన్ని సహి ంచేది లేదని ఆయన అన్నారు. తిరుపతిని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. జిల్లాకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌, అపెరల్‌ పార్కులు, వ్యవ సాయ ఆధార పరిశ్రమలు వస్తున్నాయని, ఇక్కడి యువతకు ఉద్యోగాలు వస్తా యని చంద్రబాబు వెల్లడించారు. విశాఖకు 15 రోజులకో ఐటీ కంపెనీ వస్తుం దని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేశ్‌, అమర్‌నాథ్‌ రెడ్డి, స్థానిక నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో తన పిలుపునకు స్పందించి రైతులు రాజధాని నిర్మాణానికి రూ. 40వేల కోట్లు విలువెన భూములను ఇవ్వడం అభినందనీయమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరులో జిల్లాలో శ్రీసిటీ వస్తుందని తిరు పతి ఎయర్‌పోర్టు పక్కన సెల్‌ కంపెనీలు వస్తున్నాయాన్నరు. మన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని చంద్ర బాబు తెలిపారు. చెత్తరహిత ప్రాంతంగా పంచాయతీలను తయారు చేస్తున్నట్లు చెప్పా రు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత అందరూ తీసుకోవాలన్నారు.  రొంపిచర్ల క్రాస్‌ నుంచి రొంపిచర్లకు వెళ్లే మార్గాన్ని విస్తరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో విద్యుత్తు కొరతను అధిగమించినట్లు చంద్రబాబునాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా అరవవాండపల్లెలో జరిగిన సభలో మాట్లాడుతూ సాగునీరు అందక ఏ రైతు నష్టపోకూడదని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com