ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవ్యాంధ్రలో నవ నగరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 19, 2017, 02:58 AM

-పర్యాటక నగరానికి అత్యధిక భూమి  


-పరిపాలన నగరానికి అతి తక్కువ ప్రణాళికలు సిద్ధం చేసిన సిఆర్‌డిఏ  


-25,796 మంది రైతులు 32,448 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అందజేత


-217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో   రాజధాని నిర్మాణం 


అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మహానగరంలో అంతర్భాగంగా నిర్మించే 9 నగరాలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ దాదాపు పూర్తయింది. 25,796 మంది రైతులు 32,448 ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అందజేశారు. కృష్ణా నది ఒడ్డున 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టింది. నిధుల సమీకరణ ఓ కొలిక్కి వచ్చింది. ఇక డిజైన్ల (ఆకృతులు)ను ఆమోదించి నిర్మాణం మొదలుపెట్టడమే మిగిలింది. రాజధాని అంటే కేవలం  పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పరిశోధన, పర్యాటకం, ఆతిథ్యం, కళలు, సాంస్కృతిక, వాణిజ్య, సాంకేతిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా నిలవాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. ఇవన్నీ వస్తే ఉపాధి అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చేయడానికి అనువుగా దీనిని నిర్మిస్తారు. మన దేశంలోని గాంధీనగర్‌, జైపూర్‌, నయారాయ్‌పూర్‌, ఛండీగఢ్‌, అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసి, ఆస్ట్రేలియాలోని కాన్‌ బెర్రా, బ్రెజిల్‌ లోని బ్రాసిలియా, మలేషియాలోని పుత్రజయ, కిజకిస్తాన్‌ ఫీల్‌‌డ ప్లాన్‌‌డ నగరాలు ఉన్నాయి. ఆయా నగరాలలో కార్యకలాపాలను, ఆకృ తులను పరిశీలించిన తరువాత అమరావతి మహానగరంలో అంతర్భాగంగా చుట్టూ ఓ మణిహారంలా 9 నగరాలుగా నిర్మించాలని నిర్ణయించారు. 1.ప్రభుత్వ పరిపాలన నగరం 2. న్యాయ నగరం 3. ఆర్థిక నగరం 4.విజ్ఞాన నగరం 5.ఎలక్ట్రానిక్‌‌స నగరం 6. ఆరోగ్య నగరం 7. ఆటల నగరం 8. మీడియా నగరం 9.పర్యాటక నగరం. ఈ నగరాల్లో కట్టడాలన్నీ మన సంస్కృతి ప్రతిబింభించే విధంగా నిర్మిస్తారు.  అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలకు సంబంధించిన అత్యంత ఆధునిక వసతులతోపాటు విద్య, వైద్యం, సాంకేతిక, రవాణా సౌకర్యాలన్నీ ఈ నగరాలలో అందుబాటులో ఉంటాయి. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ నగరాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో సకల హంగులతో ఈ 9 నగరాలను కలుపుతూ విశాలమైన రోడ్లు నిర్మిస్తారు. 60 మీటర్ల వెడల్పున మూడు ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. 50 మీటర్ల వెడల్పుతో 275 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు, 25 మీటర్ల వెడల్పుతో మరికొన్ని రోడ్లు నిర్మిస్తారు. అంతేకాకుండా 97.5 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, 186 కిలోమీటర్ల పొడవున 8 వరుసల ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తారు. 134 కిలో మీటర్ల పొడవున మెట్రో రైలు మార్గం నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది. కాలుష్యరహిత రాజధాని నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. జలకళతో పచ్చని చెట్లు, పచ్చికబయళ్లతో నిండిన పర్యావరణాన్ని కల్పించేందుకు సీఆర్‌డిఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధి కార సంస్థ)  ప్రణాళికలు సిద్ధం చేసింది. 


ప్రభుత్వానికి 22న రాజధాని ప్రధాన ఆకృతులు...


రాజధాని ప్రధాన ఆకృతులను నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్టనర్‌‌స సంస్థ 22న ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నేపధ్యంలో ఈ 9 నగరాలకు ప్రభుత్వం భూములను కేటాయించింది. రాజధాని నగర పరిధి మొత్తం 53,647 ఎకరా లు. అత్యధికంగా పర్యాటక నగరానికి ఎక్కువ భూమి కేటాయించింది. అతి తక్కువగా పరిపాలన నగరానికి కేటాయించింది. ఆ వివరాలను పరిశీలిస్తే పర్యాటక నగరానికి 11,574 ఎకరాలు, విజ్ఞాన నగరానికి 8,547 ఎకరాలు, ఎలక్ట్రానిక్‌‌స నగరానికి 6,582, ఆరోగ్యనగరానికి 6,511, ఆర్థిక నగరానికి 5,168, మీడియా నగరానికి 5,107,  క్రీడల నగరానికి 4,150, న్యాయ నగరానికి 3,438, పరిపాలన నగరానికి 2,702 ఎకరాలు కేటాయించారు. ప్రతి నగరంలో వివిధ విభాగాలకు కూడా భూముల కేటాయింపు జరిగిపో యింది. ప్రతి నగరంలో ఆయా రంగాలకు చెందిన కార్యాలయాలతోపాటు ఆయా శాఖల ఉద్యోగుల నివాస గృహాలు ఉంటాయి. ఈ నగరంలో ఎలక్రా ్టనిక్‌‌స కు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలు, వాటి కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 6,582 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1862 ఎకరాలు, పారిశ్రామిక రంగానికి 1618, వినోదం, ఇతర ప్రయోజనాల కోసం 757, వాణిజ్య అవసరాలకు 682,  ప్రత్యేక జోన్‌ కు 645, భవిష్యత్‌ అవస రాలకు 503 ఎకరాలు కేటాయించారు. 


ఆరోగ్య నగరం...


ఈ నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులు, కార్పోరేట్‌ ఆస్పత్రులు, వైద్య విశ్వ విద్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 6,511 ఎకరాలు కేటాయించారు. ఈ మొత్తంలో వివిధ విభాగాల కేటాయింపులను పరిశీలిస్తే గృహావసరాలకు 3,306 ఎకరాలు, భవిష్యత్‌ అవసరాలకు 1072, ప్రత్యేక జోన్‌ కు 1048, వినోదం, ఇతరత్రా ప్రయోజనాల కోసం  బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 580, వాణిజ్య అవసరాలకు 504 ఎకరాలు కేటాయించారు. 


ఆర్థిక నగరం...


ఈ నగరంలో ఆర్థిక శాఖకు చెందిన ప్రభుత్వ సంస్థలతోపాటు ఇతర ఆర్థిక సంస్థల కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 5,168 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1389 ఎకరాలు, వినోదం, ఇతర సామాజిక ప్రయోజనాల నిమిత్తం బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 1250, ప్రత్యేక జోన్లకు 844, వాణిజ్య అవసరాలకు 828, భవిష్యత్‌ అవసరాలకు 756, పారిశ్రామిక రంగానికి 101 ఎకరాలు కేటాయించారు. 


క్రీడల నగరం...


ఈ నగరంలో క్రీడా మైదానాలతోపాటు ఆ శాఖకు చెందిన పరిపాలన కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 4150 ఎకరాలు కేటాయించారు. వివిధ విభాగాల కేటాయింపులు పరిశీలిస్తే గృహావసరాలకు 1819 ఎకరాలు, భవిష్యత్‌ అవసరాలకు 693, ఇతర సామాజిక ప్రయోజనాల నిమిత్తం బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 555, వాణిజ్య అవసరాలకు 513, ప్రత్యేక జోన్లకు 436, పారిశ్రామిక అవసరాలకు 134 ఎకరాలు కేటాయించారు. 


న్యాయ నగరం...


ఈ నగరంలో హైకోర్టుతోపాటు ఇతర న్యాయస్థానాలు, న్యాయవ్యవస్థకు సంబంధించిన పరిపాలనా కార్యాలయాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి ఆ శాఖకు చెందిన ఉద్యోగుల నివాస గృహాలు  ఉంటాయి. ఈ నగరానికి 3,438 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1276 ఎకరాలు, వినోదం, ఇతర సామాజిక అవసరాలకు 692, భవిష్యత్‌ అవసరాలకు 545, వాణిజ్య అవసరాలకు 467, ప్రత్యేక జోన్లకు 458 ఎకరాలు కేటాయించారు.  


మీడియా నగరం...


ఈ నగరంలో ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌, వెబ్‌ మీడియాలకు చెందిన కార్యాలయాలు, ఆయా సంస్థల ఉద్యోగుల గృహాలు ఉంటాయి. ఈ నగరానికి 5,107 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1862 ఎకరాలు, వినోదం, ఇతర సామాజిక అవసరాలకు బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 1291, భవిష్యత్‌ అవసరాలకు 567, వాణిజ్య అవసరాలకు 791, ప్రత్యేక జోన్లకు 346, పారిశ్రామిక అవసరాలకు 250 ఎకరాలు కేటాయించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com