కేంద్రం తీరుపై చంద్రబాబు అసంతృప్తి
Written by : Suryaa Desk
![]() |
![]() |

విజయవాడ, మేజర్‌న్యూస్ : విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన సమస్యలపై కేంద్రంపై రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించారు. విభజన చట్టం హామీల అమలుపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు వాటి అమలుపై కీలక అంశాలను చర్చించారు. మూడేళ్లు గడుస్తున్న విభజన హామీలు ఇంకా అమలు కాలేదంటూ కేంద్రం తీరుపై బాబు అసతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ రావాల్సిన వాటాపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో స్థానికత గడవు జూన్ 1 తేదీతో ముగుస్తుంది. 2017 జూన్ 2 తేదీలోపు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తిస్తామని, కేంద్రం ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొంది. ఈ చట్టం ప్రకారం స్థానికత గడువు జూన్ 1 తేదీతో ముగుస్తుంది. ఈ గడువును మరో రెండేళ్లు పెంచాలని, ఇందుకోసం కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.