12 లక్షల మందికి నిరుద్యోగ భృతి!

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:58 AM
 

(అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి) : నవ్యాంధ్రలో ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతిని ఇచ్చే కసరత్తు వూపందుకుంది. భృతి ఇవ్వడంతోపాటు వారిలో సమాజం పట్ల బాధ్యత పెంచేలా సామాజిక స్ప హను పెంపొందించనున్నారు. ఎంత ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి. ఎవరిని నిరుద్యోగులుగా గుర్తించాలి వంటి ప్రాథమిక అంశాలపై ముందుగా ఒక నిర్ణయానికి రావాలని ఏపీ యువజనాభ్యుదయ శాఖ భావిస్తోంది. రాష్ర్టంలో ఉన్న పరిశ్రమలు, కర్మాగారాల్లో ఖాళీలు, ఎలాంటి అర్హతలున్నవారు అవసరం వంటి వివరాలను సేకరించి అర్హులైన నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ర్టంలో నిరుద్యోగ భతిని పొందేందుకు 12 లక్షల మంది అర్హులైన నిరుద్యోగులున్నట్లు ప్రజాసాధికార సర్వే ప్రకారం ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సంఖ్యపైనే ఆధార పడకుండా నిరుద్యోగులుగా ఎవరిని, ఎలా గుర్తించాలనే విధివిధానం ఖరారయ్యాక అర్హుల సంఖ్యను నిర్ధరించనున్నారు. నిరుద్యోగులే నమోదు చేయించుకునే ప్రక్రియను చేపట్టే దిశగానూ యోచిస్తున్నట్లు సమాచారం. కుటుంబ వార్షికాదాయ పరిమితి, విద్యార్హత, ఎంతకాలం నుంచి ఉద్యోగం లేదు వంటి ప్రాథమిక అంశాలతోపాటు ఉపాధికల్పన కేంద్రంలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల వివరాలనూ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భతిగా నెలకు రూ.1500 ఇవ్వాలా? రూ.2 వేలు ఇవ్వాలా? ఎలా ఇవ్వాలి? ఎంతకాలం ఇవ్వాలి? వంటి అంశాలపైనా కసరత్తు చేస్తున్నారు. దేశంలో పశ్చిమబెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నిరుద్యోగ భ తి పంపిణీ పథకం అమలు చేసినట్లు యువజనాభ్యుదయ శాఖ గుర్తించింది. కొన్ని సాంకేతిక కారణాలతో అక్కడ పథకం కుంటుపడింది. అమలులో లోపాలు, పరిష్కారానికి చర్యలు తదనంతర పరిణామాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత లోటుపాట్లు లేకుండా ఏపీలో పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించేలా సమర్థంగా అమలు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది.


కర్ణాటక తరహాలో ఏపీలోనూ : కర్ణాటకలో నిరుద్యోగ యువతను పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేస్తున్న తరహాలోనే ఏపీలోనూ నిరుద్యోగ యువతలో సామాజిక స్పహ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట చెలిమల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం వంటి ప్రభుత్వ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయనున్నారు. మొత్తంగా సామాజిక కార్యక్రమాలకే పరిమితం చేస్తే ఉద్యోగాల్లో చేరడంలో వెనుకబడే ప్రమాదం ఉన్నందున పర్యావరణం, ఆరోగ్యం, అక్షరాస్యత వంటి సామాజిక అంశాల్లో మ్త్రామే భాగస్వాములను చేస్తే బాగుంటుందని నిరుద్యోగ భతి కల్పనపై ఏర్పాట్కెన మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. ప్రస్తుతం ఉపాధి కల్పన కోసం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలతో అనుసంధానంగా నిరుద్యోగ భతిని కొనసాగించనున్నారు. ఆయా శాఖల సమన్వయంతో ఉపాధి కల్పించనున్నారు. నైపుణ్యాభివద్ధి సంస్థ ద్వారా అవసరమైన శిక్షణ ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయనున్నారు.