ఉగ్ర ఉష్ణోగ్రతలపై ఉదాసీనత

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:16 AM
 

(అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి):  నిరంతరాయంగా చెమటలు... ఒళ్లంతా పేలుడు... శరీరమంతా మంటలు... అసలు ప్రాణం ఏమైపో తుందో అనిపించేలా ఉన్న వాతావరణంతో రాజధాని ప్రాంత జనం అల్లల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండే గహిణులు కూడా వడదెబ్బకు గురవు తున్నారు. హైదరాబాద్‌ నుంచి కొత్తగా వచ్చిన ఉద్యోగులైతే ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక వేరే ప్రాంతాలకు బదిలీ చేయించుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఈ పరిస్థితులను వూహించి ఎంతో ముందు చూపుతో వ్యవహరిం చినా ఆచరణరూపం ఇవ్వడంలో యంత్రాంగం విఫలమవుతూ వస్తోంది. మొక్కలను నాటేటప్పుడు చేసే హడావుడి వాటిని సంరక్షించడంలో కనిపించడం లేదు. మరోవ్కెపు అభివద్ధి పనుల పేరిట భారీ వ క్షాలను యథేచేగా నేలకూలుస్తు న్నారు. వాటిని వేరే చోట నాటేందుకు అందివచ్చిన సాంకేతికను సరిగా ఉపయోగించుకోవడంలేదు. ఫలితంగా రాజధాని ప్రాంతం ప్రస్తుతం అగ్నిగో ళంలా మారిపోయింది. రాష్ర్ట రాజధాని అమరా వతిని ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అవన్నీ ఆచరణలోకి రావాలంటే చాలా ఏళ్లు పడుతుంది. ఈ లోపు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు తగిన కార్యాచరణ లేకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. ఈ మధ్య కాలంలో బెంజిసర్కిల్‌ దగ్గర పైవంతెన నిర్మాణం కోసం జాతీయ రహదారి పక్కన చెట్లన్నింటినీ కొట్టేశారు. విజయవాడ-మచిలీపట్నం రహదారి విస్తరణ పనుల పేరిట కూడా భారీ వ క్షాలను నరికేశారు. అలాగే రాజధాని నిర్మాణానికి సమీకరించిన భూముల్లో ఒకప్పుడు అరటి తోటలు వంటివి విస్తారంగా ఉండేవి. ఇప్పుడు వాటికి ప్రత్యా మ్నాయంపై యంత్రాంగం దష్టి సారించలేదు.


42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే


తీవ్రత 52 డిగ్రీల్లా


విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఈ సీజన్‌లో తరచూ 42, 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాస్తవ వేడితో పోలిస్తే శరీరానికి అనిపించే ఉష్ణోగ్రత పది డిగ్రీల మేర అధికంగా ఉంటోంది. గాలిలో తేమ శాతం పెరుగుతున్న కొద్దీ ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని బాగా తగ్గించడం, ప్రధాన కూడళ్లలో నీటి ఫౌంటెన్లు, కార్బన్‌డ్కె ఆక్సైడ్గను పీల్చే యంత్రాలను ఏర్పాటు చేయడం వంటివాటిపై ద ష్టిపెట్టాలని తిరుపతికి చెందిన పర్యావరణ నిపుణులు డా.పి.వి.రంగనాయకులు సూచిస్తు న్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులో మార్చి 17న మధ్యాహ్నం 12 గంటలకు ఉపరితల ఉష్ణోగ్రత 48.8 డిగ్రీలుగా నమోదైంది. ఎంజీ రోడ్డు పక్కనే ఎక్కువ చెట్లున్న ఓ వీధిలో అదే సమయంలో 42.6 డిగ్రీలుగా నమోదైంది. ఎంజీ రోడ్డు విశాలంగా ఉండి చెట్లు లేకపోవడంతో సూర్యకిరణాలు నేరుగా రోడ్డును తాకడంతో ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. పక్క వీధిలో భవనాలు, చెట్ల నీడ కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి.


అక్కడి చల్లదనం గుట్టు.... పచ్చని చెట్టే


విజయవాడ నడిబొడ్డునున్న ఆంధ్రా లయోల కళాశాలలో మూడొంతుల భాగం భారీ వ క్షాలతో నిండి ఉంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రత నగరంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే రెండు, మూడు డిగ్రీల మేర తక్కువ ఉంటోంది. వీచే గాలి చల్లగానే ఉంటుంది. విజయవాడ నుంచి వెలగపూడి సచివాలయానికి క ష్ణా కరకట్ట మీదుగా వెళ్తే...మంతెన సత్యనారాయణరాజు ప్రక తి ఆశ్రమం దగ్గరకు చేరుకునే సరికి ఒక్కసారి చల్లని వాతావరణం శరీరాన్ని తాకుంది. కారణం..అక్కడ పెద్ద ఎత్తున చెట్లు ఉండటమే. కళ్ల ముందే ఇంతటి మంచి ఉదాహరణలు కనిపిస్తున్నా... మొక్కల పెంపకంపై మ్త్రాం శ్రద్ధ కొరవడుతోంది.


సుందరీకరణ పేరిట డాబుసరి


అభివ ద్ధి, రహదారి విస్తరణ పనుల పేరిట గత కొన్నేళ్లలో విజయవాడ నగరంలో 30 శాతం చెట్లు నరికేశారని పర్యావరణవేత్తల అంచనా. వాటి బదులు సుందరీకరణ మొక్కలు నాటుతున్నారే తప్ప పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మొక్కలు నాటడం లేదు. విజయవాడ నగరంలోని పార్కులు, ఇతర చోట్ల పచ్చదనం అలంకరణకు పరిమిత మైనదే తప్ప, హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానం దరెడ్డి, సంజీవయ్య పార్కు తరహాలో సువిశాలమైన విస్తీర్ణంలో భారీ చెట్లతో విస్తరించలేదు.


నాటారంట మొక్కలు... చల్లారంట విత్తులు 


కష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 2015, 2016 సంవత్సరాల్లో దాదాపు 4.34 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది గుంటూరు జిల్లాలో 1080, క ష్ణా జిల్లాలో 375 హెక్టార్ల విస్తీర్ణంలో వేప, చింత, సుబాబుల్‌, సీమ తంగేడు, సీమ కానుగ తదితర విత్తనాలను హెలికాఫ్టర్‌ ద్వారా చల్లారు. వాస్తవంలో చూస్తే వాటిలో ఎన్ని పెరిగాయో అసలు ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి.


రామగుండం నుంచి నేర్చుకుందామా పాఠం


రామగుండం... తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలకు చిరునామా. అదంతా...గతం. రామగుండంలో ఒకప్పటితో పోలిస్తే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ అక్కడ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల లోపే. మొక్కలు నాటడం, పచ్చదనం పెంచడాన్ని మహోద్యమంలా చేపట్టడంతో ఇది సాధ్యపడింది. కాలనీలు, వీధులన్నింటినీ పచ్చదనంతో నింపేశారు. పదేళ్లుగా వారు చేసిన కషి ఇప్పుడు ఫలితాలిస్తోంది. 


ఇంట్లో ఉన్నా వడదెబ్బ : డా.చక్రవర్తి, జనరల్‌ ఫిజీషియన్‌, సచివాలయ ఆరోగ్య కేంద్రం 


గాలిలో తేమ శాతం పెరగడంతో మనం అనుభవించే వేడి తీవ్రత అధికంగా ఉంటోంది. మనిషి శరీరంలోని నీరు, లవణాలు చెమట రూపంలో బయటకొచ్చేయడానికి ఈ వాతావరణం కారణమవుతోంది. అందుకే ఇంట్లో ఉన్నా వడదెబ్బకు గురవుతుంటారు.