ప్రతి ఇంటికి గ్యాస్‌ పంపిణీియే చంద్రబాబు లక్ష్యం

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:11 AM
 

  చంద్రగిరి, మేజర్‌న్యూస్‌ : రాష్ట్రంలో ప్రతి ఇంటికి గ్యాస్‌ కనెన్షన్‌ పంపిణి చేసి ఎక్కడ వంట చెరకు వాడకుండా చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఐతేపల్లి సింగిల్‌విండో అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రమణ్యం నాయుడు అన్నారు. చంద్రగిరి, అక్కగార్ల కాలనీలో లబ్ధిదారులకు దీపం పథకం కింద గ్యాస్‌ సిలిండర్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా పల్లినేని సుబ్రమణ్యం నాయుడు మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని వందశాతం అభివృద్ధి చేయుటకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. 


   అమరావతి నిర్మాణం చారిత్రాత్మకమని, ప్రపంచంలో అన్ని దేశాల్లో అమరావతి నిర్మాణం ఆదర్శంగా నిలిచిపోతుంద న్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలుగు దేశం ప్రభుత్వంను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఎన్‌టిఆర్‌ గృహకల్ప కింద పేద ప్రజలకు 2 లక్షల రూపాయలతో చంద్రబాబు ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి ఇస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు, పెన్షన్‌ ఇచ్చి ఆదుకుంటుందన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు వెయ్యి రూపాయల పెన్షన్‌ ఇచ్చి వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్‌ ఇస్తున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్ర మహిళలు కష్టపడ కూడదని ప్రతి ఇంటికి సబ్సిడి గ్యాస్‌లు పంపిణి చేస్తూ అందరిని చంద్రబాబు ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో పేద ప్రజల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 


   రాష్ట్రాన్ని దేశంలో 3వ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే చంద్రబాబు నాయుడు ధ్యేయమన్నారు. గ్రామ గ్రామాన, పట్టణాల్లో తెలుగుదేశం ప్రభుత్వం శక్తివం చన లేకుండా అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు లేనిపోని విమర్శలు చేయడం దారుణమన్నారు. అభివృద్ధిపై రాజీలేకుండా నిద్రాహారాలు మాని చంద్రబాబు నాయుడు కష్టపడుతుంటే ప్రతిపక్ష నేత జగన్‌ ప్రతిదానికి విమర్శిం చడం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నెరవేర్చుతున్నారని, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా రన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యుడు గౌస్‌భాషా, ఇన్‌ఛార్జి తాహ సీల్దార్‌ గుణశేఖర్‌, టిడిపి నాయకులు సక్కూరు ధనంజయరెడ్డి, పలువురు రేషన్‌ షాపు డీలర్లు, లబ్దిదారులు, ఆర్‌.ఐ వెంకటేశ్వర్లు, విఆర్‌ఓ మునస్వామి, వాసు తదితరులు పాల్గొన్నారు.