కల్యాణకట్టలో భక్తులకు మరింత మెరుగైన సేవలు

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:08 AM
 

   తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి : తిరుమల ప్రధాన కల్యాణకట్టలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన 4వ నెంబరు హాలులో టిటిడి ఇఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఇఓ కె.ఎస్‌. శ్రీనివాసరాజులు కలిసి శుక్ర వారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అందుబాటులోకి తీసుకొ చ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఇఓ మాట్లాడుతూ కల్యాణకట్టలోని 4వ హాల్‌ను రూ.34 లక్షలతో పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. గత 9 నెలల కాలంలో కల్యాణకట్ట పునరుద్ధరణ కోసం దాదాపు రూ. 1.60 కోట్లు ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. భక్తులకు సౌకర్యవం తంగా తలనీలాలు సమర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీవారి భక్తులు సులు వుగా, సౌకర్యవంతంగా తల నీలాలు సమర్పిం చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జెఇఓతో కలిసి 4వ హాల్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ2 రామచంద్రారెడ్డి, కల్యాణకట్ట డెప్యూటి ఇఓ సి.వెంకటయ్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శర్మిష్ట, డిఇ (ఎలక్ట్రికల్‌ సరస్వతి, ఇఇ ప్రసాద్‌, ఎవిఎస్‌ఓ చిరంజీవులు పాల్గొన్నారు.